Home » Deputy CM Pawan Kalyan
రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు చకచకా రంగం సిద్ధమవుతోంది. ఈ దిశగా సోమవారం అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ సమావేశం... ఆ వెంటనే ఉన్నతస్థాయి అధికారులతో సీఎం సమీక్ష...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ కానున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు, పలు ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టులో పలు ప్రాంతాలను పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కాకినాడ నుంచి యథేచ్ఛగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతున్న వైనంపై డిప్యూటీ సీఎం పవ న్కళ్యాణ్ నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులు పద్ధతి మార్చు కోకుండా మాఫియాకు సహకరిస్తున్నారంటూ ధ్వజ మెత్తారు. రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోయేలా అధికారులే సహకరిస్తున్నారంటూ శివాలెత్తారు.
కాకినాడ పోర్టు రేషన్ బియ్యం స్మగ్లింగ్కు అడ్డాగా మారిపోయిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
రేషన్ బియ్యం అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రేషన్ మాఫియా వెనుక బలమైన నెట్వర్క్ ఉందని అన్నారు. తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
రాజ్యసభలో జనసేన ప్రాతినిధ్యం కోసం ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీకి పని పట్ల నిబద్ధత, భారతదేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
గత వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. వారి హయాంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరిగిందని ఆరోపించారు. ఏపీకి చెందిన రూ.110 కోట్ల విలువైన ఎర్రచందనం కర్ణాటకలో దొరికితే, వాటిని ఆ రాష్ట్రం అమ్మేసిందని చెప్పారు.
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తనకు ఎన్నో విలువైన సూచనలు సలహాలు ఇచ్చారని.. బిజీ షెడ్యూల్లో తనకు సాదర స్వాగతం పలికిన ఉప రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతున్నానని పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.