Share News

రాజ్యసభకు నాగబాబు?

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:17 AM

రాజ్యసభలో జనసేన ప్రాతినిధ్యం కోసం ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

రాజ్యసభకు నాగబాబు?

అన్న కోసం డిప్యూటీ సీఎం యత్నం

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రాజ్యసభలో జనసేన ప్రాతినిధ్యం కోసం ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ పెద్దలను కలిసి విన్నవించినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో తమకు ఒకటి కేటాయించాలని ఆయన కోరినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ విషయాన్ని కేంద్ర పెద్దల వద్ద ఆయన ప్రస్తావించినట్లు తెలిసింది. పవన్‌ చర్చలు ఫలిస్తే ఆయన అన్న, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పెద్దల సభలో అడుగు పెట్టడం నల్లేరుపై నడకేకానుంది. జనసేన ఆవిర్భావం నుంచి నాగబాబు పార్టీ కోసం పని చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో పర్యటించి అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ, కూటమి పార్టీల సీట్లు పంపకాల్లో భాగంగా అనకాపల్లి స్థానాన్ని బీజేపీ తీసుకోవడంతో నాగబాబుకు అవకాశం దక్కలేదు. ఆ సమయంలోనే రాజ్యసభకు పంపిస్తానని నాగబాబుకు పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో దీనిలో ఒకటి తీసుకుని నాగబాబును పెద్దల సభకు పంపించాలని పవన్‌ భావిస్తున్నారు.

Updated Date - Nov 28 , 2024 | 04:17 AM