Home » District
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. పార్టీ నాయకులు, అభిమానులు ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ఎన్నికల నిబంధనల కారణంగా ఎన్టీఆర్ విగ్రహాల వద్ద వేడుకలను నిర్వహించలేకపోయారు. పార్టీ కార్యాలయాలు, క్యాంప్ కార్యాలయాలలో ..
‘సారీ.. పేషెంట్ రావడం ఆలస్యమైంది. ఒక ఐదు నిమిషాల ముందు వచ్చి ఉన్నా ప్రాణాలను కాపాడేవాళ్లం..’ ఈ డైలాగ్ చాలా సినిమాల్లో ఉంటుంది. చాలామందికి అనుభవంలోకీ వచ్చి ఉంటుంది. రోగికి సకాలంలో వైద్యం అందడం ఎంత కీలకమో.. ఈ మాటలు చెబుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు, హార్ట్ ఎటాక్, బ్రెయిన సో్ట్రక్ వంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఆస్పత్రికి సకాలంలో వెళ్లగలగాలి. ప్రమాదం తలెత్తిన తరువాత మొదటి గంటపాటు సమయాన్ని ‘గోల్డెన అవర్’ అని వైద్యులు అంటుంటారు. అంటే.. ఆ సమయంలో వైద్యం అందిస్తే రోగి ప్రాణాలు నిలబడతాయి. లేదా.. ప్రమాద తీవ్రత బాగా తగ్గుతుంది. ఇదీ.. సమయానికి ఉన్న విలువ. ప్రాణాలు నిలబెట్టే వైద్యులకు...
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రెమ్యునరేషన అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ డబ్బు పంచకుండా మింగేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అనంతపురం అర్బన నియోజకవర్గంలో 2019లో జరిగిన ఎన్నికల సందర్భంలోనూ భారీగా నిధులను మింగేశారు. ఆ సమయంలో ఉన్న అధికారులు ఎన్నికలు ముగియగానే వెళ్లిపోవడంతో ఎవరిని అడగాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మరోసారి అలాంటి గడ్డు పరిస్థితే ఎదురు కాబోతోంది. బూత లెవల్ ఆఫీసర్లు(బీఎల్‌ఓ)లు..
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి తీరు ఆ పార్టీ నాయకులకే మింగుడు పడటం లేదన్న వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఆయనకు తర తమ బేధాలు ఉండవంట. ఎవరైనా సరే.. ఎందులోనైనా సరే వాటా ఇవ్వాల్సిందేనట. అది లేఅవుట్లైనా.., వెంచర్లలైనా సరే..తనకు..తన కుటుంబ సభ్యులకు ముడుపులు చెల్లించాల్సిందేనట. లేదంటే అధికారం అండతో నిబంధనలు ...
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం చిన్ననేలటూరు గ్రామానికి చెందిన గాజుల కుమారస్వామి, గాజుల అమరేశ్వరప్పకు చెందిన ఎద్దును అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురం గ్రామానికి చెందిన షేక్ నజీర్‌బాషా రూ.15 లక్షలకు శనివారం కొనుగోలు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జరిగిన బండలాగుడు పోటీలలో ఈ ఎద్దు సత్తా చాటినట్లు సమాచారం. ఎ.నారాయణపురంలో సంక్రాంతి ...
జేఎనటీయూలో జూన 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఎస్పీ గౌతమిశాలితో కలిసి కౌంటింగ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలను శనివారం ఆయన పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లను సమయానికి కన్నా ముందుగానే పూర్తి చేస్తున్నామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలోకి అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జేఎనటీయూలో భద్రతను మరింత పెంచడానికి మరిన్ని...
ఖరీఫ్ సాగుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విత్తన వేరుశనగ కాయలలో నాణ్యత డొల్ల అని తేలింది. నాసులు, పుచ్చులు అధికంగా ఉండటంతో రైతులు పెదవి విరుస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణా లోపం, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకుల నిర్వాకం ఆదిలోనే బయట పడింది. జిల్లా వ్యాప్తంగా ఆర్బీకేల్లో శుక్రవారం విత్తన వేరుశనగ పంపిణీని అధికారులు ప్రారంభించారు. కాయలకోసం ఆత్రంగా వచ్చిన రైతులు.. నాణ్యతను చూసి ఉసూరుమన్నారు. శింగనమల మండలం కల్లుమడిలో 100 క్వింటాళ్లు, యాడికి ఆర్బీకేలో 50 క్వింటాళ్లు, అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురం ఆర్బీకేలో 50 క్వింటాళ్ల ...
బ్రహ్మోత్సవాలలో భాగంగా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి గురువారం గోవాహనంపై విహరించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి గోవాహనంపై కొలువుదీర్చారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ ఊరేగించారు. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు....
ఎక్కడైనా ఒక పోస్టులో ఒకే అధికారి ఉంటారు. కానీ జడ్పీలో మాత్రం ఒక పోస్టులో ఇద్దరు అధికారులు పనిచేస్తున్నారు. ఇద్దరూ విధులకు వస్తారు. ఎవరిస్థాయిలో వారు ఆదేశాలు.. సూచనలు ఇస్తారు. కానీ ఎవరివి పాటించాలో తెలియక కిందిస్థాయివారు జుట్టు పీక్కుంటున్నారు. ఏ సమస్యపై ఎవరిని కలవాలో, ఎవరికి ఏ వినతి పత్రం ఇవ్వాలో తెలియక ...
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే తన లక్ష్యమని జిల్లా నూతన ఎస్పీ గౌతమి శాలి స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీగా ఆమె తన చాంబర్లో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు జిల్ల్లా ఎస్పీగా ఉన్న అమితబర్దర్‌పై ఎన్నికల సంఘం సస్పెన్షన వేటు వేసి, విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన కమాండెంట్‌గా ఉన్న గౌతమి శాలిని జిల్లా ఎస్పీగా నియమించడం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కాన్ఫరెన్స హాల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తామన్నారు. అన్ని వర్గాల ...