Home » District
తుంగభద్ర జలాలు జిల్లా సరిహద్దులోకి ప్రవేశించాయి. జలాశయం నుంచి నీటిని సోమవారం ఉదయం ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి విడుదల చేశారు. దీంతో మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆంధ్రా సరిహద్దు బొమ్మనహాళ్ వద్ద 105.272 కి.మీ. రెగ్యులేటర్ వద్దకు నీళ్లు వచ్చాయి. దీంతో హెచ్చెల్సీ అధికారులు, ఆయకట్టు రైతులు పూజలు చేసి స్వాగతం పలికారు. జలాశయంలో ఎగువకాలువ(హెచ్చెల్సీ)కి నీరు విడుదల చేసినపుడు మూడు లేదా నాలుగురోజులకు నీరు ఆంధ్రా సరిహద్దుకు చేరేవి. అయితే కర్ణాటకలో హెచ్చెల్సీ
జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. గురువులకు గురువుగా భావించే కొలిచే షిర్డీ సాయిబాబా ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో సాయినామస్మరణ ప్రతిధ్వనించింది. స్వామివారికి పంచామృతాభిషేకాలు, రుద్రాభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, కాగడహారతులు, పల్లకీసేవలు నిర్వహించారు. మధ్యాహ్నం వేలాదిమందికి అన్నదానం చేశారు. సాయంత్రం విశేషంగా అలంకరించిన రథంలో సాయినాథున్ని కొలువుదీర్చి బాణసంచా ...
మండల పరిధిలోని వీరన్నపల్లి గ్రామంలో టీడీపీ వర్గీయుల మామిడి మొక్కలను వైసీపీ వర్గీయులు నరికేశారు. రెడ్డప్పరెడ్డి, భరతకుమార్ సోదరుల తోటలో మూడేళ్ల వయసుగల 120 మామిడి మొక్కలను గురువారం అర్ధరాత్రి నరికేశారు. తామిద్దరం గురువారం రాత్రి తోటవద్దకు వెళ్లామని, ఆ సమయంలో తమ గ్రామానికి చెందిన వైసీపీ వర్గీయులు గోపాల్, శ్రీనివాసులు, ...
సమష్టి కృషితోనే సత్ఫలితాలు సాధ్యమని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు. ఆ శాఖల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి తెలుసుకున్నారు. జిల్లాలో 103 ప్రభుత్వ శాఖలు ఉన్నాయని, ప్రతిశాఖ పోటీపడి పనిచేయాలని సూచించారు. శాఖల పరిధిలో ప్రగతి నివేదికలను రోజువారీగా పంపాలని ఆదేశించారు. రోజువారీ ...
డబ్బు, నగల మీద యావతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా చంపేశాడు ఓ వ్యక్తి. గుంతకల్లు పట్టణంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపేసిన అనంతరం ఐదు నెలల పసికందుతో పారిపోతుండగా.. స్థానికులు అనుమానించి పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్య గురించి వెలుగులోకి వచ్చింది. పాత గుంతకల్లులోని కనకవీటి వీధికి చెందిన నారాయణస్వామి, రంగమ్మ దంపతులు పండ్ల వ్యాపారం చేస్తుంటారు. వీరికి ...
వైసీపీ రియల్టర్లు బరితెగించారు. నిబంధనలు తుంగలో తొక్కి లే అవుట్ వేశారు. పంచాయతీ అవసరాలకు స్థలం ఇవ్వాల్సి ఉండగా అది వదలేదు. మరో వైపు ల్యాండ్ కన్వర్షన జరగలేదు. అహుడా అనుమతులు తీసుకోలేదు. అయినా లేఅవుట్ వేయడంతో పాటు ప్లాట్లు వేసి దర్జాగా విక్రయించేశారు. ఇందుకు రిజిస్ట్రేషన అధికారులు యథాశక్తి సహకరించడంతో ఆ రియల్టర్ల పని మరింత సులువుగా జరిగి పోయింది. ...
ప్రకృతి సహకరిస్తున్న గ్యారెంటీ లేదు. పంట పండుతుందో? లేక ఎండుతుందో తెలియదు. ధర ఉంటుందో పంట చేతికి రాగానే పడిపోతుందో అంచనా లేదు. కానీ అతను రైతు కదా..! మొండి ధైర్యం ఆయన సొంతం. అందుకే ఖరీఫ్‌లో ఓ మోస్తరుగా వర్షాలు కురిసినా వందల ఎకరాల్లో పంటలు సాగు చేశాడు. మరి కొందరు మళ్లీ వర్షం కురిస్తే సాగు చేయడానికి పొలాలు సిద్ధం చేసుకున్నారు. మండలంలో రెండు, మూడు సార్లు ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇంతకాలం బీళ్లుగా ...
మండలంలోని హావళిగి గ్రామంలో పాత మట్టి మిద్దె కూలి ఆదివారం తెల్లవారుజామున దంపతులు మృతి చెందారు. గ్రామానికి చెందిన కోనప్ప గారి మారెప్ప(48), అతడి భార్య లక్ష్మిదేవి(44) కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటి పైకప్పునకు శనివారం రాత్రి 8 గంటల వరకూ ఆర్‌సీసీ వేశారు. వారి ఆచారం ప్రకారం ఆర్‌సీసీ వేసిన కొత్త ఇంటిలో నిద్రించకూడదని, ఆదివారం ఉదయం కొత్త ఇంటిలో చేరుదామని, పక్కనే ఉన్న తమ పాత ఇంటిలో నిద్రించారు. మారెప్ప, అతడి భార్య లక్ష్మిదేవి ఇంటికి ...
జిల్లాలో ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అలా్ట్రసౌండ్ స్కానింగ్ యంత్రాలు వచ్చాయి. జిల్లాలోని తరిమెల, కంబదూరు, బెళుగుప్ప, పెద్దవడుగూరు, ఎద్దులపల్లి, వజ్రకరూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు ఈ యంత్రాలను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పీహెచసీలకు అధునాతన యంత్రాలు రావడంతో మహిళలు, గర్భిణులు, ఇతర ప్రజలు స్కానింగ్ చేయించుకోవడానికి వేరే ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవస్థ తప్పింది. ఒక్కో ...
ప్రసిద్ధిగాంచిన గూగూడు కుళ్లాయిస్వామి చిన్నసరిగెత్తు కార్యక్రమం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గూగూడు కిక్కిరిసి పోయింది. ఈ సందర్భంగా కుళ్లాయిస్వామిని దర్శించుకుని చక్కెర చది వింపులు, ఫతేహాలు నిర్వహించారు...