Home » DK Shivakumar
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకే కాంగ్రెస్ హైకమాండ్ పట్టం కట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సీఎంగా సిద్ధరామయ్యపేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.
కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి పేరుపై నాలుగు రోజుల నుంచి నెలకొన్న ఉత్కంఠతకు తెరపడబోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఈ ప్రక్రియను చూసినపుడు ఎన్నికల్లో విజయం సాధించడమే సునాయాసమైన విషయంగా కనిపిస్తోంది.
న్యూఢిల్లీ: కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే దానిపై హస్తినలో ఎడతెరిపి లేకుండా పార్టీ అధిష్ఠానం చర్చలు సాగిస్తోంది. మంగళవారం రాత్రి వరకూ ఖర్గే ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో బుధవారం వరకూ సీఎంపై ప్రకటనలో జాప్యం జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నారు. తుది నిర్ణయాన్ని బెంగళూరులోనే ప్రకటించనున్నారు.
కర్ణాటక తదుపరి సీఎం విషయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగినా ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. అయితే నాయకత్వంలో ఎవరు ఎవరివైపు ఉన్నారో తెలియవస్తోంది...
కర్ణాటకలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న సమయంలో సారథ్యం వహించిన డీకే శివకుమార్ ఒకవైపు, బలహీనవర్గాలు, దళితులు, మైనార్టీలను ఏకతాటి వైపు నడిపే..
న్యూఢిల్లీ: కర్ణాటక తదుపరి సీఎం విషయంలో సిద్ధరామయ్య , డీకే శివకుమార్ ఎవరికి వారే గట్టి పట్టుదలతో ఉండగా, డీకే రాజీనామా చేయనున్నారనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. ఈ వార్తలను డీకే తీవ్ర స్థాయిలో ఖండించారు. అలాంటి వార్తలు ప్రసారం చేస్తే పరువునష్టం కేసు వేస్తానన్నారు. పార్టీనే తన తల్లి అని స్పష్టం చేశారు
పార్టీ సీనియర్ సిద్ధారామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి కోసం పట్టుబడుతున్నారు. వెనక్కితగ్గే ఉద్దేశ్యంలేదని ఇద్దరూ చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన శనివారం నుంచి ఇదే పంచాయితీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం అభ్యర్థిత్వంపై తేల్చిపడేయాలని భావించిన అధిష్ఠానం..
బెంగళూరు: కర్ణాటక తదుపరి సీఎం ఎంపిక ప్రక్రియి కీలక దశకు చేరుకుంది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలున్నప్పటికీ, ఈ విషయంలో జరుగుతున్న జాప్యంతో సీఎం అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి చెందిన జి.పరమేశ్వర పేరు తాజాగా తెరపైకి వచ్చింది.
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతోంది.