Home » ED
ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. ఇప్పటి వరకూ కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు. కవితకు.. తనకు మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత తరుఫున ఆమె భర్త అనిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే ఈడీ అరెస్టు చేసినట్లు పిటిషన్లో కవిత పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు చెప్పి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి దర్యాప్తు సంస్థ పై తగిన చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. కవిత తరుఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తున్నారు. కవితను అధికార దుర్వినియోగంతో అరెస్ట్ చేశారని.. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో ఇచ్చిన మాట ఉల్లంఘించారన్నారు.
ఈడీ అధికారులపై పశ్చిమ బెంగాల్లో జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు అదుపులో లేవనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలని అడిగింది.
‘న్యూస్క్లిక్ టెర్రర్ కేసు’లో (NewsClick terror Case) వ్యాపారవేత్త, అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్కు ఈడీ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. భారత్లో చైనా అనుకూల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
లిక్కర్ పాలసీ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎగ్గొట్టారు. మనీల్యాండరింగ్ కోణంపై ఆరా తీసేందుకు ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నిందితుల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కసరత్తు చేస్తుందని సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ను తాము కోరుకోవడం లేదని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి అనూహ్యంగా మలుపు తిరిగింది. గత కొద్ది రోజులుగా స్తబ్ధతగా ఉన్న ఈ కేసు ఉన్నపలంగా తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు (BRS MLC Kavitha) తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపే
అక్షయ గోల్డ్ కుంభకోణంపై (Akshaya Gold scam) ఈడీ (ED) ఛార్జిషీట్ దాఖలు చేసింది.