Home » Eknath Shinde
శివసేన పార్టీని చీల్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్లపై మహారాష్ట్ర శాసన సభ సభాపతి రాహుల్ నార్వేకర్శ నివారం స్పందించారు.
మహారాష్ట్ర రాజకీయాలు ఎవరూ ఊహించని విధంగా వరుస మలుపులు తిరుగుతున్నాయి. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని అడ్డంగా చీల్చి, ఆ పార్టీ తమదేనంటూ అజిత్‌పవార్ ఈసీని ఆశ్రయించిన వ్యవహారం ఇంకా సద్దుమణగక మునుపే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్‌థాకరే శుక్రవారంనాడు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలుసుకున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఎన్సీపీని చీల్చి, అజిత్ పవార్ (Ajit Pawar) వర్గం బీజేపీ-శివసేన కూటమిలో చేరడంతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.
మహారాష్ట్రలో ‘పవార్’ గేమ్‌లో కీలక ఘట్టం బుధవారం కనిపించబోతోంది. ఎన్సీపీలోని శరద్ పవార్, అజిత్ పవార్ బలాబలాలు తేలిపోబోతున్నాయి. అధికార పక్షంతో చేతులు కలిపిన అజిత్ పవార్‌తోపాటు, మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కూడా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరువురి మద్దతుదారులు తమ నేత ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అజిత్ పవార్ మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన మరుసటి రోజే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సంచలన ప్రకటన చేస్తారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టు సోమవారంనాడు మీడియా సమావేశంలో ప్రకటించారు. అభివృద్ధి ఎజెండాకు అజిత్ పవార్ మద్దతు ప్రకటించినట్టు చెప్పారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు త్వరలోనే ఉద్వాసన పలకడం ఖాయమని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆదివారంనాడు శివసేన-బీజేపీ కూటమిలో చేరిన అజిత్ పవార్ సీఎం స్థానంలోకి వస్తారని అన్నారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి బీజేపీ-శివసేన కూటమిలో అజిత్ పవార్ చేరడం, వెంటనే ప్రభుత్వంలో రెండవ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు. తమ ప్రభుత్వంలో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారనీ, ఇంతవరకూ డబుల్ ఇంజన్‌గా ఉన్న తమ ప్రభుత్వం ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వమైందని అన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం రెండు ముఖ్యమైన వంతెనలకు పేర్లను మార్చింది. వెర్సోవా-బాంద్రా సీ లింక్ వంతెనకు వీర్ సావర్కర్ సేతు అని నామకరణం చేసింది. అదేవిధంగా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ వంతెనకు అటల్ బిహారీ వాజ్‌పేయీ స్మృతి నవ సేవ అటల్ సేతు అని పేరు పెట్టింది. రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వంతెనలకు భరత మాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టినందువల్ల వివాదాలకు తావులేదన్నారు.
శివసేన వ్యవస్థాపక దినోత్సవం ఈనెల 19న పోటాపోటీగా నిర్వహించేందుకు అటు ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, ఉద్ధవ్ థాకరే సారథ్యంలో శివసేన యూబీటీ సిద్ధమవుతున్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన మంగళవారంనాడు పత్రికల్లో ఇచ్చిన ఫుల్ పేజీ పత్రికా ప్రకటన వివాదాస్పదం కావడంతో వెంటనే అప్రమత్తమైంది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. బుధవారం మరో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. మొదటి యాడ్‌లో వచ్చిన విమర్శలను రెండో యాడ్‌లో సరిచేసుకుంది.