Home » Election Commission
ఏపీ డీజీపీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని.. ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయా అధికారులు హామీ ఇచ్చారని బీజేపీ నేత భాను ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు. కానీ నేటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్ విడుదలైంది.
లోక్‌సభ ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తున్న పార్టీలు ఒకడుగు ముందుకేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘిస్తున్నాయి. ఎంసీసీని ఉల్లంఘించినందుకుగానూ ఈసీ(EC) దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని అతిక్రమించినందుకు బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలకు ఈసీ గురువారం నోటీసులు జారీ చేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ చీఫ్ (నిఘా విభాగాధిపతి)గా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు బుదవారం అర్థరాత్రి రాష్ట్ర సీఎస్ కె ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
Andhrapradesh: ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలయ్యే వరకు ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు 62 వేల మంది రాజీనామా చేశారని కోర్టుకు న్యాయవాది తెలిపారు. 900 మందిపై చర్యలు తీసుకున్నామని కోర్టుకు ఈసీ న్యాయవాది తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని ఈసీ న్యాయవాది వెల్లడించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌కు గాంధీ కుటుంబంతో సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తన ఒక్కడి సందేహాం కాదని యావత్ దేశ ప్రజలు ఇదే మాట అనుకుంటున్నారని వివరించారు.
Andhrapradesh: ఎన్నికల వేళ నిస్పక్షపాతంగా వ్యవహరించని అధికారుల పట్ల ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వాలంటీర్లతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులపై ఈసీ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. వీరంతా ఎన్నికల విధుల్లో ఉండకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. తాజాగా మరో ఐఏఎస్ అధికారినిపై కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. సీతమ్మపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, పాలకొండ అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కల్పనా కుమారిని..
పార్లమెంటు ఎన్నికల్లో పోటీ అంటే.. అందరూ ఉద్ధండులు, అనుభవజ్ఞులే ఉంటారని అనుకుంటాం! ఇప్పటి వరకూ చాలా సందర్భాల్లో అటువంటి సంప్రదాయం కొనసాగింది కూడా! కానీ, ఇప్పుడు తరం మారుతోంది!
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పోలీసులు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారా..? లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు చేతలో ఉన్నారా...? అని మండిపడ్డారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని 8 కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 2.00 గంటల మధ్య ఈ రీపోలింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది.