Share News

Election Commission: ఎన్నికల వేళ తనిఖీలు.. రూ. 8,889 కోట్లు సీజ్

ABN , Publish Date - May 18 , 2024 | 08:24 PM

సార్వత్రిక ఎన్నికల వేళ నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు, డ్రగ్స్, మద్యంతోపాటు ఉచిత పంపిణీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

 Election Commission: ఎన్నికల వేళ తనిఖీలు.. రూ. 8,889 కోట్లు సీజ్

న్యూఢిల్లీ, మే 18: సార్వత్రిక ఎన్నికల వేళ నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు, డ్రగ్స్, మద్యంతోపాటు ఉచిత పంపిణీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటి మొత్తం విలువ రూ.8,889 కోట్లు ఉంటుందని తెలిపింది. అయితే అందులో సింహ భాగం డ్రగ్స్‌దేనని స్పష్టం చేసింది. అంటే రూ.3,959 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడిందని వివరించింది.


దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తైంది. మే 20వ తేదీ అయిదో దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తనిఖీల్లో పట్టుబడిన సంపద వివరాలను ప్రకటించింది. మరోవైపు మే 26, జూన్ 1వ తేదీన ఆరు, ఏడు దశల్లో పోలింగ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరగనుంది.


ఆ సమయంలో సైతం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మరింత నగదు, మద్యం, డ్రగ్స్ రవాణా అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడు దశల్లో పోలింగ్ ప్రహాసనం పూర్తి అయ్యే నాటికి.. తనిఖీల్లో పట్టుబడే సంపద మరింత పెరగవచ్చునని అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతుంది.

Read Latest National News and Telugu News

Updated Date - May 18 , 2024 | 08:24 PM