Share News

AP Election 2024: పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు!

ABN , Publish Date - May 17 , 2024 | 06:32 PM

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా చెలరేగిన హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటైంది. ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ నియామకం అయ్యింది. ఇప్పటికే ప్రాథమిక విచారణ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

AP Election 2024: పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు!

అమరావతి: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా చెలరేగిన హింసపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటైంది. ఏడీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ నియామకం అయ్యింది. ఇప్పటికే ప్రాథమిక విచారణ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రేపటిలోగా ఈసీకి సిట్ నివేదిక అందివ్వనున్నట్టు సమాచారం. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలోని జరిగిన ఘటనలపై నివేదించనున్న తెలుస్తోంది. సిట్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసీ ఆదేశాలతో హింసాత్మక ఘటనలకు కారకులైన నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది.


కొందరు అభ్యర్థులతో అంటకాగిన పోలీసులపైనా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా హింసాత్మక ఘటనలు జరిగిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గృహ నిర్బంధం విధించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఇళ్ల వద్ద సాయుధ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. అదనంగా 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని దేశించిగా.. ఇప్పటికే రాష్ట్రానికి 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకున్నాయి. కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లను సీఈవో పరిశీలించనున్నారు.

Updated Date - May 17 , 2024 | 06:32 PM