Home » Election Results
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ( DGP Anjani Kumar )పై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ డీజీపీని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. ఇదే అశంపై అదనపు డీజీలు సందీప్‌కుమార్ జైన్, మహేశ్‌భగవత్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
ఈ ఎన్నికల్లో సోనియమ్మ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ( MLA Sitakka ) తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డాక రెండు పర్యాయాలు టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చిన ప్రజలు మూడోసారి కాంగ్రెస్ వైపు మొగ్గారు. నిజానికి ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగానే కనిపించింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కి ప్రజలు జై కొట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) శుభాకాంక్షలు తెలిపారు. కవిత ఏమన్నారంటే.. ‘‘ఈ ఎన్నికల్లో కష్టపడిన BRS కుటుంబ సభ్యుల కృషికి ధన్యవాదాలు. మీరు చేసిన పోరాటానికి సోషల్ మీడియా యోధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.అధికారం ఉన్నా, లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమే. మనమందరం మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దాం’’ అని కవిత తెలిపారు.
ఊహించిన విధంగానే మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ కంటే 90 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన జ్యోతిరాధిత్య సింధియా ప్రాంతమైన గ్వాలియర్-మాల్వా ప్రాంతంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తారు..? ఎంత మెజారీటీతో గెలుస్తారన్నదానిపై బెట్టింగ్‌లు నడుస్తున్నాయ్. జిల్లాల వారీగా కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ కాస్తున్నారు.
మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు కలిగిన మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17వ తేదీన ఎన్నికలు ముగిశాయి. గతంలో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. 2018లో 75.63% పోలింగ్ నమోదవ్వగా.. 2023లో 77.15% పోలింగ్ నమోదు అయ్యింది.
Rajasthan Exit Polls 2023 : రాజస్థాన్.. భారతదేశానికి పశ్చిమాన ఉన్న రాష్ట్రం. నవంబర్-25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి పలు ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి...
ఒక్క ఓటు కూడా అభ్యర్థుల తలరాతను మార్చగలదు. ఒకే ఒక్క ఓటు కూడా సీఎం అభ్యర్థులను సైతం ఓడించగలదు. గతంలో జరిగిన ఎన్నికల్లో అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. సీఎం అభ్యర్థి సైతం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన ఉదంతం 2008వ సంవత్సరంలో జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కడక్‌నాథ్ చికెన్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. స్థానికంగా ఉండే ఝాబువా జిల్లాలో దొరికే కడక్‌నాథ్ కోళ్లలో అధిక మాంసకృతులు, తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాధారణ రోజుల్లో ఉండే ధర కన్నా ప్రస్తుతం 30 నుంచి 40 శాతం వరకు పెరిగింది.