Home » Elon Musk
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్(ట్విటర్) తమ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇక నుంచి ట్విట్టర్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చని ప్రకటించింది.
నానాటికీ పెరుగుతున్న భారతీయ సీఈఓల సంఖ్య చూసి టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ పొగడ్తల వర్షం కురిపించారు. ఇంప్రెసివ్ అంటూ ఒక్క మాటలో తన మనోభావాన్ని వ్యక్తం చేశారు.
చంద్రయాన్-3 కార్యక్రమంపై ప్రపంచమంతా దృష్టి పెట్టింది. భారత దేశ కీర్తి, ప్రతిష్ఠలను; శక్తి, సామర్థ్యాలను చాటి చెప్తూ, ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడే ఈ కార్యక్రమాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా దీని కోసం భారత్ చేస్తున్న ఖర్చు చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం సెలబ్రిటీలతో పాటూ సామాన్యులు కూడా ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. కొందరైతే ఫిట్నెస్ పేరుతో ప్రాణం మీదకు తెచ్చుకున్న సందర్భాలు, మరికొందరు ఏకంగా ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలను కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి..
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎవరు..? అన్న మాటకు.. వరుసగా, ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.. ఇలా చెప్పుకొంటూ పోతాం. కానీ వీరి కంటే ..
తాను ట్విటర్‌ని సొంతం చేసుకున్నప్పటి నుంచి.. ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌తో ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. మొదట ఆఫీస్‌లో మార్పులతో తెగ హంగామా చేసిన మస్క్.. ఆ తర్వాత ఈ ప్లాట్ఫార్మ్పై తన పైత్యం ప్రదర్శించడం..
మార్చి 15న ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈఓగా(Twitter CEO Elon Musk) బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సంచలానత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించడం, బ్లూటిక్కు డబ్బులు వెచ్చించాల్సి రావడం, ట్వీట్లు చూసే విషయంలో, ట్వీట్లు పెట్టే విషయంలో పరిమితులు, ట్విట్టర్ వినియోగించాలంటే కచ్చితంగా లాగిన్ కావాలనే నిబంధనలు ఇలా అనేక కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇవి చాలవన్నట్టుగా ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ లోగేనే మార్చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ లోగో మారిపోయింది. ఎక్స్ హోల్డింగ్స్ కార్పొరేషన్ పేరిట గత మార్చిలో అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మస్క్ ఓ కొత్త కంపెనీని స్థాపించారు. ‘ఎక్స్’ అనే దాన్ని కొన్నాళ్లుగా ఆయన ‘ఎవ్రిథింగ్ యాప్’గా వ్యవహరిస్తున్నారు. ట్విటర్ ప్లాట్‌ఫామ్ రంగు కూడా నీలం నుంచి నలుపునకు మారిపోయింది.
చైనాకు చెందిన యాప్ ‘వీ చాట్’ (We Chat) మాదిరిగానే సూపర్ యాప్‌ను రూపొందించాలని ఎలాన్ మస్క్ యోచిస్తున్నారు. ‘‘మనం త్వరలోనే ట్విటర్ బ్రాండ్‌కు గుడ్‌బై చెప్పాలి. క్రమంగా పక్షులన్నింటికి కూడా. ఈ రోజు రాత్రికే ఎక్స్ లోగో అందుబాటులోకి వస్తే.. రేపే ప్రపంచవ్యాప్తంగా ఈ లోగో లైవ్‌లోకి వస్తుంది’’ అంటూ మస్క్ ట్వీట్ చేశారు.
లగ్జరీ కార్ల గ్లోబల్ దిగ్గజం టెస్లా (Tesla) విస్తరణలో భాగంగా భారత్‌లోనూ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు పెట్టుబడుల ప్రతిపాదనపై భారత ప్రభుత్వంతో చర్చిస్తోంది. ఏడాదికి 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో ఫ్యాక్టరీ ఏర్పాటు చర్చిస్తున్నట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ రిపోర్ట్ పేర్కొంది.