World's Richest Woman: అంబానీ కాదు.. ఆదానీ కూడా కాదు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు ఈమేనట.. ఆస్తి ఎంతో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-08-02T17:59:35+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎవరు..? అన్న మాటకు.. వరుసగా, ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.. ఇలా చెప్పుకొంటూ పోతాం. కానీ వీరి కంటే ..

World's Richest Woman: అంబానీ కాదు.. ఆదానీ కూడా కాదు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు ఈమేనట.. ఆస్తి ఎంతో తెలిస్తే..!

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎవరు..? అన్న మాటకు.. వరుసగా, ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.. ఇలా చెప్పుకొంటూ పోతాం. కానీ వీరి కంటే అత్యంత సపన్నులు ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. అందులోనూ వారు ఓ మహిళ అని చెబితే నమ్మశక్యంగా ఉండదు కానీ.. ఇది నిజం. వీరందరికంటే అంతులేని ఐశ్వర్యం ఆమె సొంతమట. ఇంతకీ ఆమె ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వారు.. తదితర వివరాల్లోకి వెళితే..

భూమి జీవించిన అత్యంత ధరిక మహిళల్లో చైనాకు (China) చెందిన ఎంప్రెస్ వూ (Wu Zetian) ఒకరు. చైనీస్ చరిత్రలో మొదటి, ఏకైక మహిళా చక్రవర్తి (woman emperor china) ఈమే. పదవి కోసం సొంత పిల్లలను కూడా చంపినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఉన్నత విద్యావంతురాలైన ఈమె.. 690 నుంచి 705 వరకు చైనాను పాలించింది. 15 సంవత్సరాల ఈమె సొంత పాలనలో చైనా ఎంతో అభివృద్ధి చెందిందట. చైనా సామ్రాజ్యాన్ని మధ్య ఆసియాలో విస్తరించడంలో ఈమె ముఖ్య పాత్ర పోషించింది. అలాగే ఈమె హయాంలో టీ, సిల్క్ వ్యాపారంతో చైనా ఆర్థిక వ్యవస్థ (China's economy) గణనీయమైన వృద్ధిని సాధించిందట.

Snake Video: నడిరోడ్డుపై నాగుపాము.. వెళ్లిపోతోంది కదా అని దాని పక్కనుంచే బైక్‌పై ఇద్దరు కుర్రాళ్లు దూసుకెళ్తోంటే..!

china-women.jpg

ఇక ఎంప్రెస్ వూ ఆస్తి విషయానికొస్తే.. 16 ట్రిలియన్ డాలర్స్‌గా అంచనా వేయబడింది. ఎలోన్ మస్క్, ముఖేష్ అంబానీ, జెఫ్ బెజోస్ (Elon Musk, Mukesh Ambani, Jeff Bezos) తదితరుల నికర విలువ కంటే చాలా ఎక్కువ. ఎలోన్ మస్క్ నికర విలువ 235 బిలియన్ డాలర్లు కాగా, జెఫ్ బెజోస్ నికర విలువ 150 బిలియన్ డాలర్లు. మన దేశానికి చెందిన ముఖేష్ అంబానీ నికర విలువ దాదాపు 91 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ లెక్కన టాంగ్ రాజవంశానికి చెందిన వు ఎంప్రెస్.. చరిత్రలో అత్యంత ధనిక మహిళా చక్రవర్తిగా నిలిచిపోయారు. కాగా, వు ఎంప్రెస్ జీవిత కథ ఆధారంగా ప్రస్తుతం చైనాలో అనేక సినిమాలు, టీవీ సీరియళ్లు వచ్చాయి. వీటిలో ప్రధానంగా ఫ్యాన్ బింగ్‌బింగ్ నటించిన.. ఎంప్రెస్ ఆఫ్ చైనా అనే సీరియల్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నెటిజన్లు ప్రస్తుతం ఎంప్రెస్ వూ నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు.

Viral Video: రెస్టారెంట్‌లో స్ప్రింగ్ రోల్స్ తింటున్న ఓ వ్యక్తికి సడన్‌గా ఓ డౌట్.. లోపల ఏదో కదులుతోందని చూస్తే..

Updated Date - 2023-08-02T18:05:50+05:30 IST