Home » England
2019 వన్డే ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్ యూటర్న్ తీసుకున్నాడు. వన్డేలకు గతంలో రిటైర్మెంట్ ప్రకటించిన అతడు ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించాడు. ఈ మేరకు బుధవారం నాడు 15 మంది సభ్యులతో ప్రొవిజనల్ జట్టును ఈసీబీ ప్రకటించింది. అయితే ఈసీబీ ప్రకటించిన జట్టులో గత ప్రపంచకప్‌లో రాణించిన పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కలేదు.
ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ వన్డే క్రికెట్లో అద్భుత డబుల్ సెంచరీ సాధించిన యువ బ్యాటర్ పృథ్వీ షా తాను ప్రస్తుతం టీమిండియాలోకి ఎంపిక కాకపోవడం గురించి ఆలోచించడం లేదని తెలిపాడు. కొంత కాలంగా భారత జట్టులో చోటు ఆశించి నిరాశకు గురవుతున్నా పృథ్వీషా ఇంగ్లండ్‌లోని రాయల్ వన్డే కప్ టోర్నీలో బుధవారం విశ్వరూపం చూపించాడు.
ఇంగ్లండ్ జట్టుకు కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్.. కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 18 టెస్టులు ఆడిన ఇంగ్లండ్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై బజ్‌బాల్ గేమ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్.. 3-0తో ఆ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. దక్షిణాఫ్రికా గడ్డపై ఇదే బజ్‌బాల్ గేమ్‌తో 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. పాకిస్థాన్ గడ్డపైనా మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో గెలుచుకుంది. తాజాగా యాషెస్ సిరీస్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను 2-2తో ఇబ్బంది పెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియాపైనా ఇంగ్లండ్ బజ్ బాల్ వ్యూహాన్నే అనుసరిస్తుందని అందరూ భావిస్తున్నారు.
సొంతగడ్డపై గత యాషెస్ సిరీస్ దక్కించుకుని ఎన్నో అంచనాలతో ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లోనూ తొలుత ఆధిపత్యం చెలాయించింది. తొలి రెండు టెస్టుల్లోనూ ఆ జట్టు గెలిచి తిరుగులేని ముందంజ వేసింది. అయితే మూడో టెస్టులో విజయం సాధించి నాలుగో టెస్టులో గెలుపు అంచుల వరకు వచ్చిన ఇంగ్లండ్‌కు వరుణుడు విలన్‌గా మారాడు. కానీ తప్పక గెలవాల్సిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు టీమిండియా దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపాడు. యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా బ్రాడ్‌కు తన విషెస్ తెలియచేశాడు. బ్రాడ్ సంకల్పం స్ఫూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపించాడు.
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ చెలరేగి ఆడింది. ఆ జట్టు బ్యాటర్లు వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. దీంతో ఇంగ్లండ్ జట్టుకు 275 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓపెనర్ జాక్ క్రాలీ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 182 బాల్స్‌లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో 189 రన్స్ చేశాడు.
యాషెస్ సిరీస్‌లో కీలకంగా మారిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే దుమ్ములేపాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోతూ కోస్తూ పరుగుల వరద పారించాడు. వన్డే స్టైల్లో బ్యాటింగ్ చేసిన క్రాలే 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 93 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా రాణించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 5 వికెట్లతో రాణించాడు. స్టువర్ట్ బ్రాడ్‌కు రెండు వికెట్లు దక్కగా.. జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ సాధించారు.
యాషెస్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో అతిథ్య జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికివరకు అన్ని మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ జట్టే టాస్ గెలవడం గమనార్హం. అనగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లీష్ జట్టే టాస్ గెలిచింది.
బుధవారం నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా జట్టు తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది. మ్యాచ్‌కు ఒక రోజు ముందుగానే ప్రకటించిన ప్లేయింగ్ 11లో ఒక్క ప్రధాన స్పిన్నర్ కూడా లేకపోవడం గమనార్హం. ఆస్ట్రేలియా జట్టు ఒక్క ప్రధాన స్పిన్నర్ కూడా లేకుండా బరిలోకి దిగడం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి.