Home » Exams
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్-2024 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 4, 5, 6, 9, 10, 12, 14 ర్యాంకులతో శ్రీచైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాప్ ర్యాంకుల్లోనూ, టోటల్ ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంతో దూసుకెళ్లింది.
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ఆదివారం టీజీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సుమారు 74శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి పరీక్షలో ప్రశ్నలు కొంతమేర సులువుగా ఉన్నాయని అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో ఏకంగా 26 ర్యాంకులు తెలుగు విద్యార్థులే సాధించారు.
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు (Group-1 prelims exam) ఇవాళ (జూన్ 9న) ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 31జిల్లాల్లో 4లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆదివారం నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. సుమారు 4.03లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడివడిన నీట్-2024 పరీక్ష నిర్వహణ, వెల్లడైన ఫలితాలు తీవ్ర వివాదం సృష్టిస్తున్నాయి. అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షను మళ్లీ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
శాతవాహన యూనివర్సిటీ ఎల్ఎల్బీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఒక సబ్జెక్టు పేపర్లో వచ్చిన నాలుగు ప్రశ్నలు మరో సబ్జెక్టు పేపర్లోనూ వచ్చాయి.
నీట్ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాల కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియలో కీలకమైన స్థానికత అంశాన్ని కొలిక్కి తీసుకొచ్చింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఈ నెల 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన నీట్(యూజీ)-2024 ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. 720కి 720 మార్కులతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీల్లో 8 ఫస్ట్ ర్యాంకులు సాధించి నారాయణ విద్యాసంస్థలు తమ అధిపత్యాన్ని కొనసాగించాయి.