Home » Farmers
హైదరాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ రెండో విడత నిధులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం.. రూ. 6,191 కోట్ల నిధులు విడుదల చేశారు. రెండో విడతలో భాగంగా అసెంబ్లీలో సీఎం ప్రారంభించారు. వేదికపై 17 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు.
రెండో విడత రుణమాఫీకి ముహూర్తం ఖరారైంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఆవరణలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
Telangana: తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూసిన రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది. మొదటి విడతగా లక్ష మేరకు రుణాలు మాఫీ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుని.. దాన్ని అమలు చేసింది కూడా. అలాగే జూలై నెలాఖరు వరకు లక్షన్నర.. ఆగష్టు 15 నాటి మొత్తం రెండు లక్షల రుణాబకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.
రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఈ నెలాఖరు (ఎల్లుండి)లోగా రైతులకు రూ.1.50 లక్షల రుణాలను మాఫీ చేసి, తమ నిబద్ధతను చాటుకుంటామని తెలిపారు.
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలోని కిచ్చనకుంట తండాలో జరిగింది.
వ్యవసాయ బోరు బావులకు కాకుండా ఇతర వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఉదయ్ ఒప్పందంలో ఉందని హరీశ్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ‘‘రేవంత్ రెడ్డి కూడా సీనియర్ సభ్యుడే.
ప్రభుత్వ గ్యారెంటీ అప్పులపై కేంద్రం ఆంక్షలు కొనసాగుతోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో ఓ ప్రభుత్వ రంగ సంస్థకు రుణం లభించనుంది. తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంక్(టీజీక్యాబ్)కు రూ.5000 కోట్ల రుణం ఇచ్చేందుకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) అంగీకరించింది.
Andhrapradesh: ‘‘చింత చచ్చినా పులపు చావదు’’ అన్న సామెతగా ఉంది వైసీపీ నేతల ఆకృత్యాలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసి.. అధికారాన్ని కోల్పోయినప్పటికీ వారి ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. పలు చోట్ల బరితెగింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. పైకి మాత్రం అబ్బే.. మావాళ్ల మీదే దాడులు చేస్తున్నారంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంతే కాదు ఏపీలో శాంతిభద్రతలు లేవంటూ ఏకంగా దేశరాజధాని ఢిల్లీకి వెళ్లిమరీ ధర్నాలు చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే అతి క్లిష్టమైన రుణ మాఫీ పథకాన్ని పట్టాలపైకి ఎక్కించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లోనూ వ్యవసాయ రంగానికే పెద్దపీట వేసింది.
రేవంత్ రెడ్డి సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్లో 25 శాతం ఆ రంగానికే కేటాయించింది. బడ్జెట్ మొత్తం రూ.2,91,159 కోట్లు కాగా.. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయించింది.