Share News

Raitu RunaMafi: తెలంగాణలో రెండో విడత రైతు రుణమాపీ ఎప్పుడంటే..

ABN , Publish Date - Jul 29 , 2024 | 11:55 AM

Telangana: తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూసిన రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది. మొదటి విడతగా లక్ష మేరకు రుణాలు మాఫీ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుని.. దాన్ని అమలు చేసింది కూడా. అలాగే జూలై నెలాఖరు వరకు లక్షన్నర.. ఆగష్టు 15 నాటి మొత్తం రెండు లక్షల రుణాబకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.

Raitu RunaMafi: తెలంగాణలో రెండో విడత రైతు రుణమాపీ ఎప్పుడంటే..
Raitu Runa Mafi

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూసిన రైతు రుణమాఫీ (Telangana Raitu RunaMafi) కార్యక్రమాన్ని ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేసి చూపించింది. మొదటి విడతగా లక్ష మేరకు రుణాలు మాఫీ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుని.. దాన్ని అమలు చేసింది కూడా. అలాగే జూలై నెలాఖరు వరకు లక్షన్నర.. ఆగష్టు 15 నాటి మొత్తం రెండు లక్షల రుణాబకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఈనెల 18న సాయంత్రం ముఖ్యమంత్రి రుణమాఫీని విడుదలచేశారు. లక్ష వరకు రుణాలు మాఫీ చేసినట్లు ప్రకటించారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Budda Venkanna: పెద్దిరెడ్డికి వీరప్పన్‌ అంటూ నామకరణం చేసిన టీడీపీ నేత


ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. అందులో ముఖ్యమైనది రైతురుణమాఫీ. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రైతాంగానికి రెండులక్షణ రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ హాయంలో చేయలేనిది తాము చేసి చూపిస్తామని చెప్పడమే కాదు.. చేసి చూపించారు సీఎం రేవంత్. ఇప్పటికే లక్ష రుణాలు మాఫీ చేసిన కాంగ్రెస్... రెండో విడత రుణమాఫీకి రంగం సిద్ధం చేసింది. రేపే(మంగళవారం) రెండో విడత రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లక్షన్నరలోపు ఆరు లక్షల మంది రైతులకు రుణాలను మాఫీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వనికి ఏడు వేల కోట్లు అవసరం. గతంలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం12 లక్షల మందికి ఆరు వేల కోట్లు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

MLA Peddireddy: ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై అనర్హత వేటు తప్పదా.. వైసీపీలో ఆందోళన!


తొలి విడతలో ఇలా...

మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. సుమారు పదకొండున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేల కోట్లు జమ చేసినట్లు వివరించారు. నిధులు విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు రైతువేదికల వద్ద సంబురాలు చేసుకున్నారు. రైతు రుణమాఫీకి రూ. 31 వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. రుణమాఫీ నిధులను వేరే అప్పులకు జమ చేయవద్దని ఇప్పటికే బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భూమికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికీ రూ.2 లక్షల రుణమాఫీ పథకం వర్తిస్తుందని చెప్పారు. కేవలం కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్‌ కార్డును పరిగణనలోకి తీసుకుంటామని, రేషన్‌ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. బ్యాంకుల్లో రుణమాఫీ నగదు జమ చేయడంతో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. రైతు కుటుంబాన్ని గుర్తించడానికి ఆహార భద్రతాకార్డు వివరాలు ప్రామాణికంగా రుణమాఫీ ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. సెంబరు 12, 2023 నాటికి రైతుకు ఉన్న రుణం, లేక రెండు లక్షల వరకు ఏది తక్కువైతే దాన్ని పొందేందుకు రైతులు అర్హులు. అలాగే రెండు లక్షల మించిన రుణం ఉన్న రైతులు ఆపైన ఉన్న రుణాన్ని మొదట చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన ఉండగా, ఆ తరువాతనే రుణమాఫీ పొందే వెసులుబాటు కల్పించింది.


ఇవి కూడా చదవండి...

GST Scam: జీఎస్టీ స్కామ్.. ఏ5గా మాజీ సీఎస్... త్వరలో నోటీసులు

Viral Video: దయచేసి ఆ రూట్లో ఎక్కడా టీ తాగకండి.. ఓ ట్రక్ డ్రైవర్ వినూత్న ప్రచారం.. కారణం ఏంటంటే..!

Read Latest Talangana News And Telugu News

Updated Date - Jul 29 , 2024 | 04:04 PM