Home » Flood Victims
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బర్‌స్టతో కులు, పధార్, మండి, సిమ్లా జిల్లాలను వరద ముంచెత్తింది. 45 మంది గల్లంతవగా.. వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి.
టీవీ ముందు.. సోఫాలో కూర్చున్న ఐదుగురు కుటుంబ సభ్యులు.. కొండచరియల ధాటికి.. అదే సోఫాలో విగతజీవులుగా మారిపోయారు..! భారీ వర్షం, చలిని తాళలేక.. రెండుమూడు బెడ్షీట్లు కప్పుకొని పడుకున్నవారు.. ఆ దుప్పట్ల కిందే మృతదేహాలుగా కనిపించారు..! కొండచరియలు పెళపెళా విరిగిపడుతున్న శబ్దాలు విని.. బయటకు పరుగులు తీయాలనే
‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళ.. ప్రకృతి ప్రకోపానికి గురైంది..! పశ్చిమ కనుమల నడుమ.. తేనీటి తోటలు, ఏపుగా పెరిగే రబ్బరు చెట్లు, చూపరులను ఆకట్టుకునే కొబ్బరి చెట్లతో ఆహ్లాదంగా ఉండే వయనాడ్‌పై విపత్తు విరుచుకుపడింది..! తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలు.. బురదతో కూడిన వరద.. విరిగిపడ్డ కొండ చరియలు.. వెరసి సోమవారం అర్ధరాత్రి
చిమ్మచీకట్లో కొండచరియలు విరిగిపడి.. నీరు, బురద కలిసి ప్రవాహమై విరుచుకుపడడంతో ఆ ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి! చాలామంది బాధితులు శిథిలాల కింద చిక్కుకుపోయి..
తీరం పొడవునా ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో.. చల్లటి నీటితో అలరారే చలియార్ నది వయనాడ్ విలయం నేపథ్యంలో కన్నీటి కాసారంగా మారింది! ఈ ఉత్పాతంలో ముండక్కై ప్రాంతంలో చనిపోయిన 31 మంది మృతదేహాలు.. చలియార్ నదిలో 25 కిలోమీటర్ల మేర
కేరళలోని వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడి సంభవించిన ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య 93కు చేరింది. ఎప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్మీతో సహా ప్రకృతి వైపరీత్యాల బృందాలు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమయ్యారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మంగళవారం, బుధవారం రెండ్రోజుల పాటు సంతాప దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం జరగడంతో కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని వయనాడ్ మాజీ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ప్రకృతి వైపరీత్యంలో బాధితులకు తక్షణ పరిహారం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.
గత కొన్ని రోజులుగా చైనా(china)తోపాటు ఉత్తర కొరియా(North Korea), తైవాన్(taiwan)లో భారీ వర్షాలు(heavy rains) కురుస్తు్న్నాయి. ఇదే సమయంలో ఉత్తర కొరియా సరిహద్దులో ఉన్న జిలిన్ ప్రావిన్స్‌లో కూడా ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కారు వరదల్లో ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఢిల్లీలో భారీ వర్షాలకు ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతిచెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన ముగ్గురిలో సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని అనే 25ఏళ్ల యువతి ఉండడంతో ఆయన మనోవేదనకు గురైనట్లు చెప్పారు. వెంటనే మృతురాలు తానియా సోని తండ్రి శ్రీ విజయ్ కుమార్‌ను ఫోన్లో పరామర్శించారు.
చైనా(china)లో గత కొన్ని రోజులుగా వర్షాలు(heavy rains) విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక ప్రాంతాల్లో వినాశకర దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం ఆగ్నేయ చైనాలో వరదల కారణంగా ఓ ఇంటిపై బురద పడి 11 మంది మరణించారు.