Home » Food
మల్బరీ పండ్లలో అనేక రకాల పోషకాలున్నాయి. ముఖ్యంగా విటమిన్ సి ఉంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇంకా విటమిన్ కె, ఐరన్, పొటాషియం, డైటరీ ఫైబర్లున్నాయి.
జీర్ణ క్రియకు కీర మంచిది. ఇందులోని డైటరీ ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
ప్రతి రోజూ ఒక గుడ్డును తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదనే ఆలోచనలో అంతా గుడ్డును ఆహారంలో తీసుకుంటూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా గుడ్డుని తమ ఆహారంలో భాగం చేసుకున్నాం. గుడ్డు పోషకాలు, ఖనిజాలు, విటమిన్లతో బలమైన ఆహారం.
ప్రస్తుతం అనేక మంది బార్బెక్యూ వంటకాలను ఆరగించేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అనేక ప్రాంతాల్లో వీటికి ఫుల్లు డిమాండ్ ఉంటుంది. వీదేశాల్లో అయితే వీటి గురించి తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ డిమాండ్ నేపథ్యంలో ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ KFC వినూత్నంగా ఆలోచించి No. 11 Eau De BBQ పెర్ఫ్యూమ్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
టమాటా రసంలో కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. 95 శాతం నీరు, 5 శాతం పిండి పదార్థాలతో పాటు ఫైబర్, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఇటివల కాలంలో యువతతోపాటు అనేక మంది కండరాల పెరుగుదల కోసం ప్రోటీన్ పౌడర్లు(protein powders) తీసుకుంటున్నారు. ప్రధానంగా జిమ్‌కి(gym) వెళ్లే వారు ఈ ప్రొటీన్ సప్లిమెంట్లను ఎక్కువగా వినియోగిస్తారు. దీంతో వీటికి పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ నేపథ్యంలో మార్కెట్లోకి నకిలీ ఉత్పత్తులు కూడా వస్తున్నాయి. అలాంటి వాటిని ఎలా గుర్తించాలి, వాటిని కొనకుండా ఎలా ఉండాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా(world wide) ఆహారం సంక్షోభం(Food Crises) గురించి ఇటివల వచ్చిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో 2023లో 59 దేశాల్లో దాదాపు 282 మిలియన్ల మంది ప్రజలు(282 million people) తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారని సర్వే తెలిపింది. ఈ సంఖ్య 2022 కంటే 2.4 కోట్లు ఎక్కువ ఉండటం విశేషం.
స్నాక్స్ అనే ప్రస్తావన వస్తే భారతీయ తల్లులు కాస్త ఆందోళన పడతారు. పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వాలని ప్రతి తల్లి అనుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు పిల్లలకు బయటి ఆహారం బాగా నచ్చుతుంది. అయితే మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు.. ఇంట్లో ఆరోగ్యంగా ...
టేస్ట్ అట్లాస్.. ఇది ప్రఖ్యాత వంటల గైడ్.. పలు మార్గాలలో వివిద దేశాల వంటకాలను, పానీయాలను అందరికీ పరిచయం చేస్తూ రుచులను వ్యాప్తి చేస్తోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ వంటకాల సంకలనాన్ని వెలువరించింది. ఏప్రిల్ 2024 ర్యాంకింగ్ ల ప్రకారం వెలువడిన ఈ సంకలనంలో టాప్ 50లో 9 భారతీయ వంటకాలుండటం విశేషం.
ఎండ వేడికి శరీరంలో శక్తి సన్నగిల్లి జనం నీరసించి పోతున్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలంలో గర్భిణులు, బాలింతలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని లేదంటే సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.