Healthy Food : వేసవి ఎండల్లో గుడ్డు తీనచ్చా..! తింటే శరీరానికి వేడి చేస్తుందా?
ABN , Publish Date - May 01 , 2024 | 03:31 PM
ప్రతి రోజూ ఒక గుడ్డును తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదనే ఆలోచనలో అంతా గుడ్డును ఆహారంలో తీసుకుంటూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా గుడ్డుని తమ ఆహారంలో భాగం చేసుకున్నాం. గుడ్డు పోషకాలు, ఖనిజాలు, విటమిన్లతో బలమైన ఆహారం.
ప్రతి రోజూ ఒక గుడ్డును తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదనే ఆలోచనలో అంతా గుడ్డును ఆహారంలో తీసుకుంటూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా గుడ్డుని తమ ఆహారంలో భాగం చేసుకున్నాం. గుడ్డు పోషకాలు, ఖనిజాలు, విటమిన్లతో బలమైన ఆహారం. దీనిని మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరిగి పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయని నమ్ముతారు చాలావరకూ.. దీనికి వేసవిలో తీసుకుంటే..
వేసవిలో గుడ్డు తీసుకోవడం వల్ల...
హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్.. గుడ్డు తీసుకోవడం కారణంగా శరీరంలో వేడి పెరగదు. ఇందులోని సోడియం,. పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి. ఇవి ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి కీలకమైనవి. వేడి వాతావరణంలో ఇవి తీసుకోవడం వల్ల వేడి పెరగదు.
వేసవిలో అలసట ఎక్కువగా ఉంటుంది. గుడ్డు, ప్రోటీన్, అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది కణజాల నిర్మాణానికి సహాయపడుతుంది. రోజంతా శక్తిని అందించడంలో ముఖ్యంగా పనిచేస్తుంది.
Health Tips : రెడ్ మీట్, వైట్ మీట్ వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా.. !
Health Tips : షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన వేసవి పానీయాలు ఇవే..!
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని విటమిన్లు ఎ, డి, బి12, ఇనుము, ఖనిజాలు ముఖ్యంగా సూక్ష్మపోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వేసవిలో ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడతాయి. గుడ్డు కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు , లుటిన్, జియాక్సంతిన్ కంటిఆరోగ్యానికి మంచిది.
వేసవిలో గుడ్డు తింటే..
గుడ్డు శరీరానికి వేడి చేయడం అనేది అపోహ మాత్రమే. ఇందులోని ప్రోటీన్ శరీరంలో శక్తిని పెంచుతుంది. ఏ కాలంలో గుడ్డును తీసుకున్నా ఫలితాలు ఒకలాగానే ఉంటాయి.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.