Home » Google
దేశంలో లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గూగుల్.. డూడుల్‌ను విడుదల చేసింది. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు వేలి మీద ఇంకుతో మార్క్ చేసినట్లుగా డూడుల్‌ను గూగుల్ విడుదల చేసింది.
Google Lays Off : ఖర్చు తగ్గింపు కారణంతో అల్ఫాబెట్(Alphabet) యాజమాన్యంలోని గూగూల్(Google) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో కొంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు(Lays Off Employees) కంపెనీ ప్రతినిధి ప్రకటించారు. ఈ తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని..
గూగుల్ కొత్త స్మార్ట్‌ఫోన్ Google Pixel 8a వచ్చే నెలలో లాంచ్ కానుంది. అయితే దీని లాంచ్‌కు ముందే కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ సందర్భంగా లీకైన డిజైన్, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోన్‌ను మే 14న జరిగే Google I/O 2024 ఈవెంట్లో లాంచ్ చేయనున్నారు.
జీమెయిల్(Gmail).. ఇది వాడని వారుండరు. ఎలక్ట్రానిక్ డివైజ్ ఏదైనా జీమెయిల్ అకౌంట్ తప్పనిసరి. జీమెయిల్ అకౌంట్‌ని తొలుత క్రియేట్ చేసుకుని, పాస్ వర్డ్ పెట్టుకోవడం తెలిసిందే. జీమెయిల్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) సంస్థ ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఇచ్చింది. తన చిన్నప్పటి ఫోటోను డ్రైవ్‌లో (Google Drive) అప్లోడ్ చేసిన పాపానికి.. అతని అకౌంట్‌ని బ్లాక్ చేసింది. దీంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి.. ఈ వ్యవహారంపై ఏడాది నుంచి గూగుల్‌తో పోరాడాడు. తన అకౌంట్‌ని పునరుద్ధరించాలని పదేపదే కోరాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి గుజరాత్ హైకోర్టుని (Gujarat High Court) ఆశ్రయించాడు.
గూగుల్ మ్యాప్ తప్పంటూ కొందరు స్థానికులు పెట్టిన బోర్డు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
రోజువారీ జీవితాల్లో గూగుల్ మ్యాప్స్ ఎంతటి ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయో తెలిసిందే. మనం ఉన్న లోకేషన్ తెలుసుకోవాలన్నా.. ఇతరులు ఉన్న ప్రాంతాన్ని కనుక్కోవాలన్నా గూగుల్ మ్యాప్స్ తప్పనిసరి. ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తే ఈ మ్యాప్స్ చాలా ఉపయోగపడతాయి.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) తన ప్లే స్టోర్ (Google Play Store) నుంచి భారత్‌కు చెందిన కొన్ని యాప్‌లను (Indian Apps) తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. సర్వీస్ ఫీజు వివాదం నేపథ్యంలో.. శుక్రవారం భారత్ మ్యాట్రిమోనీ (Bharat Matrimony), నౌక్రీతో (Naukri) పాటు పది కంపెనీలకు చెందిన యాప్‌లను తీసేసింది.
సర్వీస్ ఫీజు చెల్లింపుల వివాదంలో భారత్ మ్యాట్రిమోనీ వంటి కొన్ని ప్రముఖ మ్యాట్రిమోనీ యాప్‌లతో సహా భారతదేశంలోని 10 కంపెనీల యాప్‌లను గూగుల్ (Google) తొలగించింది.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు చెందిన అడ్వాన్స్డ్ వెర్షన్ ఏఐ టూల్ ‘జెమిని’ తాజాగా ఓ వివాదానికి తెరలేపిన విషయం అందరికీ తెలిసిందే. ప్రధాని మోదీ ఫాసిస్టా? కాదా? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆ టూల్ వివాదాస్పద సమాధానం ఇవ్వడంతో.. పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ ఐటీ మంత్రి ఘాటుగా స్పందించారు.