Share News

Google Internsip 2025: స్టూడెంట్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం.. లాస్ట్ డేట్ అప్పుడే..

ABN , Publish Date - Apr 01 , 2025 | 07:05 PM

Google Internsip Program 2025: సాంకేతిక రంగంలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు గూగుల్ సువర్ణావకాశం కల్పిస్తోంది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం కింద సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, AI, ML మొదలైన రంగాలలో పనిచేసే అవకాశం కల్పిస్తోంది. ఈ నైపుణ్యాలతో మీ కెరీర్ అద్భుతంగా మలుచుకునే ఛాన్స్ మిస్సవకండి. పూర్తి వివరాల కోసం..

Google Internsip 2025: స్టూడెంట్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం.. లాస్ట్ డేట్ అప్పుడే..
Google Summer Internship 2025 Apply Online

Google Internsip Program 2025: మీరు కంప్యూటర్ సైన్స్ లేదా టెక్నాలజీ రంగంలో అనుభవాన్ని పొందాలనుకుంటే గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ గొప్ప అవకాశం. ఈ కార్యక్రమం కింద విద్యార్థులు గూగుల్‌తో కలిసి పనిచేసే అవకాశం పొందవచ్చు. కొత్త టెక్నాలజీపై పరిశోధన చేస్తే అద్భుతమైన ఛాన్స్ దక్కించుకోవచ్చు. ఈ ప్రోగ్రాం కింద ఇండస్ట్రీలో నేరుగా పనిచేయడం ద్వారా సంపాదించిన నైపుణ్యాలతో విద్యార్థులు తమ కెరీర్ ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, AI, ML మొదలైన రంగాలలో అనుభవం పొందాలనుకునే విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభమయ్యే 12 వారాల గూగుల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం ఏప్రిల్ 17, 2025 లోపు దరఖాస్తు చేసుకోండి.


అర్హత?

కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, లేదా సంబంధిత సాంకేతిక రంగంలో బ్యాచిలర్స్, మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులు గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా టెక్నాలజీపై ఆసక్తి ఉండి ఆవిష్కరణ రంగంలో కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.


ఏం నేర్పిస్తారు?

గూగుల్‌ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ సమయంలో విద్యార్థులు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాలలో పనిచేసే అవకాశాన్ని పొందుతారు. విద్యార్థులకు నిజమైన Google ఉత్పత్తులపై పనిచేసే అవకాశం లభిస్తుంది. సాంకేతిక పరిశ్రమలో ఆచరణాత్మక అనుభవాన్ని పొందే ఛాన్స్ వారికి లభిస్తుంది. ఇంకా, Google నిపుణులు, సీనియర్ డెవలపర్‌ల నుండి మార్గదర్శకత్వం పొందవచ్చు. ఈ ఛాన్స్ విద్యార్థుల కెరీర్‌ను మరో మలుపు తిప్పడం ఖాయం.


ఎప్పుడు, ఎన్నిరోజులు?

ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం నవంబర్ 2025 చివరిలో ప్రారంభమై 12 వారాల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో విద్యార్థులు Google ప్రొడక్ట్స్ మెరుగుపరచడానికి, ప్రాబ్లం సాల్వింగ్, ఇన్నోవేషన్స్ కోసం పని చేసే అవకాశాన్ని పొందుతారు.


ఎలా దరఖాస్తు చేయాలి?

మీరు ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగం కావాలనుకుంటే Google అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. buildyourfuture లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 17, 2025. దరఖాస్తు చేసుకునే ముందు అన్ని అర్హత షరతులను జాగ్రత్తగా చదివి అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి.


Read Also: Jobs: కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేశారా లేదా.. టెన్త్ ఆర్హత, జీతం రూ.69 వేలు

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు..ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులకు మంచి ఛాన్స్..

IIT Placements: ఐఐటీ క్యాంపస్ సెలక్షన్స్‌కు దూరమవుతున్న కంపెనీలు.. తగ్గిన ప్యాకేజీలు.. కారణాలివే..

Updated Date - Apr 01 , 2025 | 07:06 PM