Home » Gujarat Titans
గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ నష్టానికి 16 ఓవర్లలోనే (206 పరుగులు) ఛేధించింది. సెంచరీతో విల్ జాక్స్ (41 బంతుల్లో 100) శివాలెత్తడంతో...
ఈ ఐపీఎల్-2024 సీజన్ బౌలర్లకు పీడకలగా మారిందని చెప్పుకోవచ్చు. ఎంత బాగా బౌలింగ్ వేసినా బ్యాటర్లను కట్టడి చేయలేకపోతున్నారు. హేమాహేమీలు సైతం భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పరిస్థితి నెలకొంది. బ్యాటింగ్‌కి అనుకూలంగా పిచ్‌లు ఉండటమే..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్ముదులిపేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (88) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో తాండవం చేయడం, అక్షర్ పటేల్ (66) అర్థశతకంతో రాణించడం...
ఐపీఎల్-2024లో భాగంగా.. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. జీటీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు ఢిల్లీ జట్టు రంగంలోకి దిగింది.
ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్(David Warner) మరోసారి వార్తల్లో నిలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతా Xలో అతని వీడియోను పంచుకుంది. వీడియోలో ఆధార్ కార్డును తయారు చేసే వార్త విన్న తర్వాత వార్నర్ పరుగెత్తడం ప్రారంభించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఏం జరిగిందో మీరు కూడా తెలుసుకోండి మరి.
ఐపీఎల్ IPL 2024(IPL 2024)లో నేడు 40వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య ఢిల్లీ(Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరగనుంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు దిగువన కొనసాగుతున్నాయి. ఈ విషయంలో వీరిద్దరూ ఈ మ్యాచ్‌లో గెలుపొందడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు.
నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు విజృంభించారు. ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి.. వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో.. తక్కువ స్కోరుకే గుజరాత్ జట్టు పేకమేడలా కూలింది.
యువ బౌలర్ యశ్ ఠాకూర్ ఓ సంచలన రికార్డ్ సృష్టించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఎవ్వరికీ సాధ్యం కాని ఫీట్‌ని తన పేరిట లిఖించుకున్నాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి, మెయిడెన్ ఓవర్ చేసిన బౌలర్‌గా అవతరించాడు.
మార్కస్ స్టోయినీస్ హాఫ్ సెంచరీతో చెలరేగినప్పటికీ మిగతా బ్యాటర్లు అంతగా సహకరించకపోవడంతో గుజరాత్ టైటాన్స్ ముందు లక్నోసూపర్ జెయింట్స్ జట్టు 164 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. లక్నో బ్యాటర్లలో స్టోయినీస్(58) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్(33), నికోలస్ పూరన్ (32) పర్వాలేదనిపించారు.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విధ్వంసానికి తోడు రాహుల్ తెవాటియా, సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ ముందు గుజరాత్ టైటాన్స్ 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన గిల్(89) అజేయ హాఫ్ సెంచరీతో గుజరాత్ భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.