Home » Guntur
ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కేసును ప్రభుత్వం ప్రకాశం ఎస్పీ దామోదర్కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు గుంటూరు జిల్లా పాలన విభాగం ఏఎస్పీ రమణమూర్తి దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నారు. వెంటనే కేసు రికార్డును ప్రకాశం ఎస్పీకు అప్పగించాలని గుంటూరు అడ్మిన్ ఏఎస్పీకు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం షాపుల కోసం మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి.
గుంటూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి.. అలాగే ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసుల విచారణ వేగవంతం కోసం సీఐడీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సోమవారం మంగళగిరి డీఎస్పీ సీఐడీకి విచారణ పైళ్లు అప్పగించనున్నారు.
అక్టోబర్ 12న దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అది క్రమంగా పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంచిపై చెడు గెలిచిన సందర్భంగా దసరా పండగ నిర్వహించుకుంటారని మంత్రి లోకేశ్ తెలిపారు.
గుంటూరు జిల్లా బీజేపీ నేతల రాసలీలలపై ఆ పార్టీ అధిష్ఠానం కన్నెర్ర చేసింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో తాము కూడా ప్రభుత్వంలో భాగస్వాములనే ధీమా ఆ పార్టీ నేతల్లో ఎక్కువైంది.
పల్నాడు జిల్లా క్రోసూరులో బురఖా ధరించిన యువకుడు స్థానిక ఆస్పత్రి వద్ద హల్చల్ చేశాడు. మహిళ వేషధారణలో వచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.
ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల కోసం జారీచేసిన లాటరీ వ్యవహారం కాక రేపుతోంది. లాటరీ విషయంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలు రాసింది. ఆ విషయం అధికారుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుసుకున్నారు.
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కనగాలలో యువతి కుటుంబంపై ప్రేమోన్మాది కత్తితో దాడికి తెగపడ్డాడు. గ్రామానికి చెందిన యువతిని రాజోలుకు చెందిన భార్గవ్ రెడ్డి అనే యువకుడు కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కొల్లు అన్నారు.