Share News

New Liquor Policy: ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు..

ABN , Publish Date - Oct 13 , 2024 | 05:12 PM

ఆంధ్రప్రదేశ్‌‌లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం షాపుల కోసం మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి.

New Liquor Policy: ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌(Andhra Pradesh)లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం షాపుల (Liquor Shops) కోసం మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి. మద్యం టెండర్ల ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 16 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానించగా రికార్డుస్థాయిలో వచ్చాయి.


రాష్ట్రవ్యాప్తంగా దాఖలైన దరఖాస్తుల ప్రకారం ప్రతి షాపునకు 25నుంచి 26 అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం దుకాణాలకు ఏకంగా 5,800 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా పరిధిలో ప్రతి షాపునకూ 50నుంచి 51 దరఖాస్తులను టెండర్ దారులు దాఖలు చేశారు. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో వీటిని పునఃపరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.


ఈసారి విదేశాల నుంచీ ఆన్‌లైన్‌లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు పెద్దఎత్తున వచ్చాయి. అయితే టెండర్ల దాఖలులో భారీఎత్తున ఏర్పడిన మద్యం సిండికేట్లు.. మొదట్లో దరఖాస్తులు పెద్దగా పడకుండా ప్రయత్నాలు చేశారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థాయిలో మద్యం దుకాణాల కోసం అప్లికేషన్లు రావడం ఇదే తొలిసారని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. అక్టోబర్ 14న మద్యం దుకాణాల కేటాయింపు కోసం ఎక్సైజ్ అధికారులు లాటరీ నిర్వహిస్తారు. అందులో మద్యం షాపులు వచ్చిన వారికి ఈనెల 15న దుకాణాలు అందజేస్తారు. దీంతో ఈనెల 16నుంచి నూతన మద్యం విధానం ఏపీలో అమల్లోకి వస్తుంది. అన్ని రకాల బ్రాండ్లకు చెందిన చీప్ లిక్కర్‌ను రూ.99కే అందివ్వనున్నట్లు ఎక్సైజ్ శాఖ ఇప్పటికే తెలిపింది. అలాగే దేశంలో తయారైన విదేశీ మద్యం బాటిళ్లు ఎమ్మార్పీ ధరను చిల్లర లేకుండా సర్దుబాటు చేసేలా అదనపు ప్రివిలేజ్ ఫీజు విధించనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

AP News: టీడీపీ ఆఫీసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత..

Nara Lokesh: ఇచ్చిన మరో హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్

Updated Date - Oct 13 , 2024 | 05:56 PM