Home » Guntur
టైప్ రైటర్ ద్వారా అద్భుతమైన చిత్రాలు వేస్తూ ఆకట్టుకుంటున్నారు తెనాలి యువకుడు నిజాముద్దీన్. మిగతా టైప్ రైటర్లకన్నా భిన్నంగా చిత్రాలు వేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ అనుబంధ సంఘాలతో ఆయన సమావేశం నిర్వహించారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి తమ ఆయుధాలను పోలీసులు తీసుకున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. వాటిని తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 97శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు. తిరుపతి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, కర్నూల్, చిత్తూరు, అనంతపురం, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 96శాతానికి పైగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
తిరుమల లడ్డూ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారని టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డెయిరీపై కేసు నమోదు అయ్యింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్పై ఏపీ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే వైసీపీ అధినేత జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో 16 మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ బదిలీ అయ్యారు. ఎం.రవిప్రకాశ్ పీ అండ్ ఎల్ ఐజీగా బదిలీ అయ్యారు.
నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నామినేటెడ్ పదవులు పొందిన వారితో ఏపీ సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 28న తిరుమలకు వెళ్లి పూజలు చేయనున్నట్లు ప్రకటించడంపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని పరీక్షల్లో నిర్ధారణ అయినా జగన్ అబద్ధాలు ఆడుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు.
నటి జెత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, కాంతి రాణా టాటా ముగ్గురు అధికారులు ఐపీఎస్ శిక్షణలో ఏం నేర్చుకున్నారో అర్థం కావడం లేదని జీవీ అన్నారు. ఓ ఆడపిల్లను వేధించడం కోసం ఇంత మంది ఐపీఎస్లు పని చేయడం దారుణమని ఆయన అన్నారు.