Share News

Vinukonda: వారి వల్ల ఏపీ పోలీసుల పరువు పోయింది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Sep 24 , 2024 | 03:39 PM

నటి జెత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, కాంతి రాణా టాటా ముగ్గురు అధికారులు ఐపీఎస్ శిక్షణలో ఏం నేర్చుకున్నారో అర్థం కావడం లేదని జీవీ అన్నారు. ఓ ఆడపిల్లను వేధించడం కోసం ఇంత మంది ఐపీఎస్‌లు పని చేయడం దారుణమని ఆయన అన్నారు.

Vinukonda: వారి వల్ల ఏపీ పోలీసుల పరువు పోయింది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
Vinukonda MLA GV Anjaneyulu

పల్నాడు: సినీ నటి జెత్వానీ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పరువు పోయిందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె విషయంలో రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధంగా పని చేసి కొంతమంది ఐపీఎస్ అధికారులు దుర్మార్గంగా వ్యవహరించారని జీవీ మండిపడ్డారు. వైసీపీ హయాంలో తాడేపల్లి దొంగల కోసం వారు సిగ్గు విడిచి పనిచేశారని ఎమ్మెల్యే ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆమెను చూసీ మార్పు రాదా?

నటి జెత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, కాంతి రాణా టాటా ముగ్గురు అధికారులు ఐపీఎస్ శిక్షణలో ఏం నేర్చుకున్నారో అర్థం కావడం లేదని జీవీ అన్నారు. ఓ ఆడపిల్లను వేధించడం కోసం ఇంత మంది ఐపీఎస్‌లు పని చేయడం దారుణమని ఆయన అన్నారు. సమాజంలో ఇంత కన్నా ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అడ్డగోలుగా పనిచేసిన శ్రీలక్ష్మి లాంటి వాళ్లను చూశామని, అలాంటి వారు కటకటాల పాలైనా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌ల్లో మార్పు రావడం లేదని ఆయన అన్నారు. ఓ మహిళను వేధించేందుకు ఇంతమంది అధికారులు కుట్రపన్ని పని చేశారంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోందని జీవీ అన్నారు. ఇలాంటి దారుణాలకు ఎన్డీయే ప్రభుత్వంలో అవకాశం లేదని, మహిళపై వేధింపుల విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి పాలనలో అడ్డగోలుగా పని చేసిన అధికారులంతా జైలుకు పోవడం ఖాయమని ఎమ్మెల్యే జీవీ జోస్యం చెప్పారు.


కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం ఖాయం..

మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం కాబోతుందంటూ ఎమ్మెల్యే జీవీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరు కేంద్రంగా కాంగ్రెస్‌ పార్టీతో వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. త్వరలో తల్లి కాంగ్రెస్‌లోకి పిల్ల కాంగ్రెస్ కలుస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది తెలిసే కొంత మంది ఆ పార్టీ నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వ 100రోజుల పాలన అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కితాబు ఇచ్చారు. 100 రోజుల పాలన చూసి వైసీపీలో భయం మొదలైందని, చంద్రబాబు-పవన్ జోడీ సూపర్ సక్సెస్ అని కొనియాడారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Ganta: అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ.. పాల్గొన్న గంటా

AP Govt: ఏపీ మహిళా కమిషన్‌ను వెంటనే తొలగించండి.. ప్రభుత్వం ఆదేశాలు

Updated Date - Sep 24 , 2024 | 03:40 PM