Share News

AP News: ఏపీలో చకచకా సాగుతున్న పింఛన్ల పంపిణీ.. రికార్డుస్థాయిలో పూర్తి..

ABN , Publish Date - Oct 01 , 2024 | 03:59 PM

విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 97శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు. తిరుపతి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, కర్నూల్, చిత్తూరు, అనంతపురం, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 96శాతానికి పైగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

AP News: ఏపీలో చకచకా సాగుతున్న పింఛన్ల పంపిణీ.. రికార్డుస్థాయిలో పూర్తి..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం చకచకా సాగుతోంది. సచివాలయ సిబ్బంది తెల్లవారుజాము నుంచే వేగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల సమయానికే రికార్డుస్థాయిలో 95.20శాతం మేర పంపిణీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 64.38లక్షల మంది లబ్ధిదారులు ఉండగా.. ఇప్పటికే 61.29లక్షల మంది చేతికి సచివాలయ సిబ్బంది ఫించన్ల నగదును అందజేశారు.


జిల్లాల వారీగా..

విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 97 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తయింది. తిరుపతి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 96 శాతానికి పైగా లబ్ధిదారులు పింఛన్లు అందుకున్నారు. నెల్లూరు, అనకాపల్లి, కడప, బాపట్ల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే 95 శాతానికి పైగా పంపిణీ పూర్తయింది.

ఇక రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయాల్సింది రూ.2,721 కోట్లు కాగా ఇప్పటివరకూ రూ.2,589 కోట్ల మేర పింఛన్ రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. గతంలో వాలంటీర్ల సాయంతో రికార్డుస్థాయిలో పంపిణీ చేయగలిగామని నాటి వైసీపీ ప్రభుత్వం చెప్పుకునేది. అయితే వారు లేకుండానే రెండు, మూడు నెలలుగా ఏపీలో రికార్డుస్థాయిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. పింఛన్ల పంపిణీలో ఎన్డీయే ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తోంది.


వృద్ధురాలిపై దాడి..

మరోవైపు కాకినాడ జిల్లా పిఠాపురంలో పింఛన్ తీసుకుని వస్తున్న వృద్ధురాలిపై ఓ దుండగుడు దాడి చేసి నగదు ఎత్తుకెళ్లాడు. పిఠాపురానికి చెందిన అనంతలక్ష్మి అనే వృద్ధురాలు పని నిమిత్తం బయటకు వెళ్లింది. వస్తూవస్తూ సచివాలయ సిబ్బంది వద్దకు వెళ్లి పింఛన్ నగదు తీసుకుంది. అయితే అక్కడ్నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తుండగా ఓ యువకుడు ఇంటి వద్ద దింపుతానంటూ ఆమెను ద్విచక్రవాహనం ఎక్కించుకున్నాడు. అనంతరం నిర్మానుష్య ప్రాంతం వద్దకు రాగానే ఆమెను బైక్ పైనుంచి నెట్టేశాడు. పింఛన్ సొమ్ము రూ.4 వేలు ఇవ్వాలంటూ బెదిరించాడు. దీంతో చేసేదేమీ లేక వృద్ధురాలు నగదు ఇచ్చేసింది. డబ్బులు తీసుకున్న దుండగుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. ఘటనపై అనంతలక్ష్మి గ్రామస్థులకు చెప్పగా.. వారంతా నిందితుడి కోసం అన్వేషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

Kadambari Jethwani: నటి జెత్వానీ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం

Huge scam: చెత్తనూ వదలని వైసీపీ.. భారీ స్కాం బట్టబయలు

Tirumala Laddu: టీటీడీ లడ్డూ వివాదంపై సుప్రీంలో కేఏపాల్ పిటిషన్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 01 , 2024 | 04:40 PM