Home » Guntur
రాష్ట్ర బడ్జెట్‌పై వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డికి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు.
హజ్ యాత్రికుల సమస్యలను ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ కోరారు.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై సినీనటుడు పోసాని కృష్ణమురళీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజనీ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కార్తీక పౌర్ణమికి సూర్యలంక సముద్రతీరానికి వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తెలిపారు.
మిర్చియార్డులో వేమన్లు జీరో, రేట్ కటింగ్, బిల్ టూ బిల్ వ్యాపారాలకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పర్సన ఇనచార్జి, జేసీ భార్గవతేజ హెచ్చరించారు.
పల్లెపండుగలో భాగంగా మంజూరు చేసిన మౌలిక సౌకర్యాల అభివృద్ధి పనులు వెంటనే పూర్తి అయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు.
Andhrapradesh: గుంటూరు జిల్లా సబ్ జైలులో నిన్న(మంగళవారం) వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. నకిరేకల్‌కు చెందిన రాజశేఖర్ రెడ్డిని వేధింపులకు గురిచేస్తున్నారని.. దమ్ముంటే రాజశేఖర్ రెడ్డి తన ఇంట్లో ఉంటాడని తీసుకువెళ్లాలని అన్నారు. ఈ క్రమంలోనే
తల్లికి.. చెల్లికి తేడా లేకుండా నీచాతి నీచంగా పోస్టులు పెట్టిన సోషల్ మీడియా సైకోలు సజ్జల భార్గవరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డిలను వైఎస్సార్సీపీ " సామాజిక కార్యకర్తలనటం" సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
అమరావతికి అందలం.. సంక్షేమానికి జవసత్వాలు.. వివిధ పథకాలకు పూర్వ వైభవం.. పడకేసిన సాగునీటి ప్రాజెక్టులకు పునరుజ్జీవం.. గత వైసీపీ ఐదేళ్లలో పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రతి రంగాన్ని గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
సర్వాంగ సుందరంగా.. అధునాతనంగా.. ఆహ్లాదకరంగా.. రక్షణాత్మకంగా.. పర్యావరణహితంగా.. చిలకలూరిపేట బైపాస్ అందుబాటులోకి వచ్చేసింది. ఎన్నో ఏళ్లుగా.. చిలకలూరిపేటవాసుల కలగా.. చిలకలూరిపేట మీదగా రాకపోకలు సాగిస్తూ ఇబ్బంది పడే వారి కష్టాలను తీరుస్తూ ఎట్టకేలకు బైపాస్ నిర్మాణం జరిగింది.