Home » Harish Rao
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. "చీకట్లను ఛేదిస్తూ.. మార్పును ఆశిస్తూ.. వెలిగిన దీపం జన జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆశిస్తూ.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి" అని రేవంత్ ఆకాంక్షించారు.
ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచితమని.. బీఆర్ఎస్ పార్టీని ఖతంచేయడం ఆయన వల్ల కాదని మాజీమంత్రి టి. హరీశ్ రావు అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. హరీష్ రావును ఎలా డీల్ చేయాలో తమకు తెలుసునంటూ సీఎం చేసిన కామెంట్స్‌కు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి.. కేసీఆర్ పెట్టిన బిక్ష అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేకుంటే.. తెలంగాణ వచ్చేది కాదన్నారు. తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు, రేవంత్‌కు నక్కకూ.. నాగలోనికి ఉన్నంత తేడా ఉందన్నారు.
రైతులకు డిసెంబరు 9న రుణమాఫీ చేయకపోవడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పడవని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి.. దేవుళ్లపై ఒట్లు పెట్టారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
Telangana: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్ ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు. 2023-24 తో పోలిస్తే 2024-25 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు తెలంగాణలో గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారం మంత్రిత్వ శాఖ నివేదికను కోట్ చేస్తూ మాజీ మంత్రి చేసిన ఈ పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
‘‘రేవంత్‌రెడ్డి 11 నెలల పరిపాలన.. ప్రజాపాలన కాదు ప్రజాపీడన’’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. పండుగ, పెళ్లిళ్ల సీజన్లో హైదరాబాద్‌లో 144 సెక్షన్ విధించడం ఏంటని, ప్రజలు దీపావళి జరుపుకోవద్దా అని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక పోలీసుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. పోలీసుల ఆవేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదని అన్నారు. అధికారం లేకుంటే ఒక మాట.. అధికారంలోకి వచ్చాక ఇంకో మాటనా.. అంటూ నిలదీశారు.
సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జన్వాడ ఫాంహౌ్‌సలో డ్రగ్స్ పార్టీలంటూ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతల అరెస్టులు తప్పవని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత సర్కారులో కీలక నేతలు నంబరు 1 నుంచి 8 వరకు అందరినీ అరెస్టు చేస్తామని ప్రకటించారు. త్వరలోనే బాంబులు పేలతాయని ..