Share News

Harish Rao: ఇదీ.. తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన అసలైన ‘మార్పు’

ABN , Publish Date - Oct 29 , 2024 | 09:30 AM

Telangana: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్ ఎక్స్‌ వేదికగా సంచలన పోస్టు చేశారు. 2023-24 తో పోలిస్తే 2024-25 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు తెలంగాణలో గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారం మంత్రిత్వ శాఖ నివేదికను కోట్ చేస్తూ మాజీ మంత్రి చేసిన ఈ పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Harish Rao: ఇదీ.. తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన అసలైన ‘మార్పు’
Former Minister Harish Rao

హైదరాబాద్, అక్టోబర్ 29: కాంగ్రెస్ పాలనలో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గిపోయాయంటూ మాజీ మంత్రి హరీష్‌ రావు (Former Minister Harish Rao) ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయని, తెలంగాణ ఆర్థిక అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందంటూ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహార మంత్రిత్వ శాఖ నివేదికను కోట్ చేస్తూ మాజీ మంత్రి హరీష్‌ రావు ఎక్స్‌లో పోస్టు చేశారు.

Viral Video: వామ్మో.. వాహనాలు గాల్లోకి ఎలా ఎగురుతున్నాయో చూడండి.. కారణం ఏంటో తెలిస్తే..


హరీష్‌ పోస్టు ఇదే..

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం 2023-24 తో పోలిస్తే 2024-25 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్లు తెలంగాణలో గణనీయంగా తగ్గినట్టు వెల్లడించిందని తెలిపారు. ఈ తగ్గుదల రాష్ట్ర మూలధన పెట్టుబడులపై ప్రభావం చూపిస్తూ, ఉద్యోగ అవకాశాలు తగ్గడం, తద్వారా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు క్షీణించిందని తెలిపిందన్నారు. ఇది తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి గొడ్డలి పెట్టు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్టప్ తెలంగాణ వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పుకుంటుందని... కానీ వాస్తవాలకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయన్నారు. కొత్త కంపెనీల సంఖ్య పడిపోవడం, లక్ష్యాన్ని చేరుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల తెలంగాణలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను కోల్పోవడమే కాక ఆర్థిక అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పుకొచ్చారు. ఇదీ... తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిన అసలైన “మార్పు” అంటూ హరీష్ రావు పోస్టు చేశారు.

ప్రభుత్వం మాది.. నీ అంతు చూస్తా


పొంగులేటి టార్గెట్‌గా..

మరోవైపు మంత్రి పొంగులేటిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన పోస్ట్‌ కూడా సంచలనంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉందని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేసి నెల రోజులు కావస్తోందని.. ఈడీ దాడులపై బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట కూడా ఎందుకు లేదని ప్రశ్నించారు. భారీగా డబ్బు దొరికినట్లు మీడియాలో వార్తలు వచ్చినా కేసు నమోదు చేయలేదన్నారు. దాడులు ముగిసిన వెంటనే హైదరాబాద్‌లో అదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా సమావేశమయ్యారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్విడ్ ప్రోకో కాక మరేమిటి అంటూ కేటీఆర్ చేసిన పోస్టు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.


ఇవి కూడా చదవండి...

సీఎంకాగానే మమ్మల్ని పక్కన పడేశారు

వాళ్లందరినీ ముక్కలుగా నరికేస్తాం: మిథున్‌

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 29 , 2024 | 09:33 AM