Home » Health
వర్షాకాలం వచ్చిందంటే చాలు సాధారణంగానే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ఈసారి మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది. తెలంగాణలో ఏ ఊరుకెళ్లినా.. ప్రజలు వైరల్ ఫీవర్తో మంచాన పడి కనిపిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో పలు గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహారించే అధికారులను సస్పెండ్ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరికలతో వైద్య ఆరోగ్యశాఖలో ఒక్కసారిగా కదలిక వచ్చింది.
జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని మలేరి యా సబ్-యూనిట్ అధికారి సి ద్దయ్య పేర్కొన్నారు.
మైగ్రేన్ చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఈ సమస్యలో తల ఒకవైపు నొప్పి ఉంటుంది. ఇది ఒకసారి వస్తె చాలా కాలం పాటు ఉంటుంది. చాలామంది మైగ్రేన్ కు చికిత్స లేదని అంటూ ఉంటారు. అందుకే మైగ్రేన్ కు నిర్ణీత మందులు ఏవి అందుబాటులో లేవు. అయితే..
డెంగ్యూ వైరస్ కారణంగా రక్తనాళాల్లోని ఎండోథిలియం పొరలో వాపు వచ్చి మధ్యలో ఖాళీలు ఏర్పడతాయి. తద్వారా రక్తంలోని ప్లాస్మా లీకేజీ అవుతుంది. కొందరిలో డెంగీ సంక్షిష్టం కావడానికి ప్లాస్మా లీకేజీ ప్రధాన కారణం. కాళ్లు, కంటిచుట్టూ వాపు, రక్తంలో హెమటోక్రిట్ స్థాయిలు పెరగడం, పల్స్, బీపీ పడిపోవడం, కాళ్లు, చేతులు చల్లబడటం, వాంతులు, కడుపులో తీవ్రమైన నొప్పి తదితర లక్షణాలు కన్పిస్తే.. ప్లాస్మా లీకేజీగా భావించి అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని సీజనల్ వ్యాధులు అనేవి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వస్తూనే ఉంటాయి. అయితే దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలను మన జీవనశైలి, మంచి ఆహారం, వ్యాయామం ద్వారా దరి చేరకుండా చేయవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ పోషకాలు కలిగిన మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి కోవలోకి వచ్చేదే సగ్గుబియ్యం. సగ్గుబియ్యమే కదా అని తేలికగా తీసిపడేయెుద్దు. వాటిని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..
రాష్ట్రంలో విష జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. జ్వరాలతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. జ్వరం బారిన పడి మంగళవారం వరంగల్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థితోపాటు మహబూబ్నగర్ జిల్లాలో ఓ 58 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు.
అప్పట్లో ఆ పేరు వింటే వణికిపోయేవారు. ప్రచారం కూడా హోరెత్తిపోయేది. వాల్ పోస్టర్లు, కరపత్రాలు, ర్యాలీలు, అవగాహన సదస్సులు, టీవీలు, రేడియోలు, సినిమా హాళ్లలో ప్రకటనలు..! ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ. ఫలితంగా హెచఐవీ, ఎయిడ్స్ పట్ల జనంలో అవగాహన పెరిగింది. వ్యాధి సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేవారు. సురక్షిత లైంగిక పద్ధతులను ప్రారంభించారు. రక్త మార్పిడి, ఒకసారి వాడిన సిరంజిలు పడేయడం, సెలూనలలో పరికరాల శుభ్రత, బ్లేడ్ మార్చారో లేదో పరిశీలించడం.. ఇలా అన్ని జాగ్రత్తలు ...
తిన్నది గొంతులోనే ఉండిపోయినట్టు అనిపిస్తూ, ఛాతీ మంట కూడా వేధిస్తుంటే ఎవరైనా దాన్ని అజీర్తి సమస్యగానే భ్రమపడతారు. దాంతో జీర్ణకోశ వైద్యులను సంప్రతించి మందులు వాడుకోవడం మొదలు పెడతారు.
కొన్ని ఆరోగ్య సమస్యలకు సమాధానం ఆహారంలోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ లక్షణాలను ఆహారంతో మెరుగ్గా అదుపులోకి తెచ్చుకోవచ్చు.