Home » Hemant Soren
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సోమవారం ప్రఽధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోలను హేమంత్ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
జైలు నుంచి విడుదలయ్యాక జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(CM Hemanth Sorean) సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని తొలిసారి కలిశారు. సీఎం పదవి చేపట్టాక ప్రధానితో జరిగిన తొలి సమావేశం ఇది. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మోదీని కలవడం చర్చనీయాంశం అయింది.
జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు బెయిలు మంజూరు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో సోమవారంనాడు సవాలు చేసింది. సోరెన్‌కు బెయిలు మంజూరు చేయడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ పేర్కొంది.
ఝార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన కొన్ని గంటలకే సీఎం హేమంత్ సోరెన్ తన కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో సోమవారం ఇన్‌చార్జీ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. పలువురు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఝార్ఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో జేఎంఎం నేత, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నెగ్గారు. సోమవారం ఝార్ఖండ్ అసెంబ్లీలో స్పీకర్ రవీంద్రనాథ్ మెహతో సమక్షంలో ఈ బల పరీక్షను నిర్వహించారు.
జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఈనెల 8వ తేదీ సోమవారంనాడు విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో విశ్వాస పరీక్ష పూర్తయిన వెంటనే మంత్రివర్గాన్ని కూడా సోరెన్ విస్తరించనున్నారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత జులై 7వ తేదీన ఆయన సీఎంగా..
జార్ఖాండ్ రాజకీయాల్లో బుధవారంనాడు అనూహ్య పరిణామాణాలు చోటుచేసుకున్నాయి. జార్ఖాండ్ ముఖ్యమంత్రి పదవికి చంపాయి సోరెన్ రాజీనామా చేసారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపారు. దీంతో మాజీ సీఎం హేమంత్ సోరెన్ తిరిగి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది.
జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తిరిగి సీఎం పగ్గాలు చేపట్టనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది.
ల్యాండ్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Soren)కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఉపశమనం కలిగింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.