Home » Hyderabad News
రాజధాని హైదరాబాద్‌లో వాన దడ పుట్టించింది. గంటన్నర పాటు కుండపోతతో కంగారు పుట్టించింది. మంగళవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. సరూర్‌నగర్‌లో 14.91 బాలానగర్‌లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పూర్తిస్థాయి కమిషనర్‌గా ఆమ్రపాలి కాట నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మనుషుల ప్రాణాలను హరిస్తూ వణికిస్తోంది. డెంగీ జ్వరాల బారిన పడి రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో ఐదు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఒక్కొక్కరూ ఒక్కొ విధంగా ప్రయత్నిస్తుంటారు. కొందరు అద్భుతమైన వీడియోలు చేసి అందరినీ ఆకట్టుకుంటే, విచిత్రమైన విన్యాసాలు చేస్తూ మరికొందరు నవ్వుల పాలవుతుంటారు. రద్దీ ప్రాంతాల్లో, జనావాసాల్లో విచిత్రంగా ప్రవర్తించి ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు ఇంకొందరు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
వర్షం కాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున.. జీహెచ్ఎంసీ పరిధిలోని.. తరచూ చెత్త వేసే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.45, రోడ్ నం.70, గౌతంనగర్ బస్తీ, దీన్ దయాళ్ నగర్ బస్తీ, ఫిల్మ్ నగర్, పీఈటీ పార్క్ ప్రాంతాల్లో తరచూ చెత్త వేసే ప్రాంతాలు సైతం దాన కిషోర్ పరిశీలించారు.
రుతుపవనాలు(Monsoon Season) ప్రభావంతో భాగ్యనగరంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరం పశ్చిమం వైపున ఉన్న గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, అల్విన్, చందానగర్, పటాన్ చెరు, అమీన్పూర్, ఇస్నాపూర్, బీరంగూడ, బీహెచ్ఈఎల్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ వెనకడుగు వేయకపోవడంపై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి(Murali Akunuri) ప్రశంసించారు.
నగరంలో నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డ్రగ్స్, చైన్ స్నాచింగ్, సెల్ ఫోన్ చోరీలు, దొంగతనాలు సహా పలు నేరాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. తాజాగా రాజేంద్రనగర్‌లో ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని ప్రేమ పేరిట వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన శ్రీహరి(21) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
జనం రద్దీతో కిటకిటలాడుతున్న ఇది ఏ బస్ స్టేషనో, రైల్వే స్టేషనో కాదు.. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయం.