Home » Hyderabad
నగరంలోని కృష్ణకాంత్ పార్కు ప్రాంతంలో ఉన్న తన ఇల్లు బఫర్ జోన్లో లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖండించారు. బఫర్ జోన్లో ఉందంటూ సోషల్ మీడియాలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.
దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల ఒక యూనిట్‌ను జాతికి అంకితం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో 237 సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు సమీపంలో రూ.826 కోట్ల భారీ ప్రాజెక్టుకు సైతం శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అవుతున్నారు.
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పాటుపడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో ఎన్నికల హామీలను ఎగ్గొట్టారని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి, దేవుళ్లపై ఒట్టుపెట్టి మరీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. లగచర్లలో ఫార్మాసిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఇప్పుడు సీఎం మాట మారుస్తున్నారని మండిపడ్డారు.
పాతబస్తీలో జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది. దుకాణాల మూసివేత విషయంలో ఎంఐఎం నేతల బెదిరింపులతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెనక్కి తగ్గారు.
హైదరాబాద్ హయత్ నగర్‌కు చెందిన ఓ మహిళ భర్త వేధింపులు తట్టుకోలేక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు 40 రోజుల కిందట వెళ్లింది. తన ఘోడు మెుత్తం ఎస్సై ఎదుట వెల్లబోసుకుంది.
2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం ములపు తిరిగిందని, శుక్రవారం (29న) 33 జిల్లా కేంద్రాల్లో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే దీక్ష దివస్‌లో కేసీఆర్ పాల్గొనటం లేదని చెప్పారు. ఈనెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతాయన్నారు.
‘ద్వేషమే విశ్వగురువై ప్రపంచానికంతా విద్వేషాన్ని ప్రచారం చేస్తున్న ఈ కాలంలో దాన్ని ఎదుర్కొనే ఏకైక ఆయుధం ప్రేమతత్వం మాత్రమే. అది కాజీ నజ్రుల్ ఇస్లాం కవిత్వం నిండా ఉంది.
ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్న హిందీ మహా విద్యాలయ.. విద్యార్థుల డిగ్రీ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసింది. ఫెయిలైన విద్యార్థులను పాసైనట్లుగా తప్పుడు సర్టిఫికెట్లను సృష్టించింది.
నర్సింగ్ రిక్రూట్మెంట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 13 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు 95.69 శాతం మంది హాజరైనట్లు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.