Share News

Hyderabad: దారుణం.. న్యాయం కోసం వెళ్తే మహిళపై లైంగిక వేధింపులు..

ABN , Publish Date - Nov 24 , 2024 | 03:53 PM

హైదరాబాద్ హయత్ నగర్‌‪కు చెందిన ఓ మహిళ భర్త వేధింపులు తట్టుకోలేక స్థానిక పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసేందుకు 40 రోజుల కిందట వెళ్లింది. తన ఘోడు మెుత్తం ఎస్సై ఎదుట వెల్లబోసుకుంది.

Hyderabad: దారుణం.. న్యాయం కోసం వెళ్తే మహిళపై లైంగిక వేధింపులు..

హైదరాబాద్: బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు గాడి తప్పుతున్నారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిన పోలీసులే వాటిని తుంగలో తొక్కుతున్నారు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ మహిళకు దారుణ పరిస్థితి ఎదురైంది. సమస్య పరిష్కరించాలని ఎస్సై వద్దకు వెళ్లడం ఆమెకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. స్టేషన్ మెట్లు ఎక్కడమే ఆమె చేసిన పాపంగా మారిపోయింది. న్యాయం కోసం వెళ్తే చివరికి అన్యాయానికి గురైంది. ఎస్సై వేధింపులు తాళలేక సదరు మహిళ ఉన్నాతాధికారులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది.

BRS: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్... కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..


హైదరాబాద్ హయత్ నగర్‌‪కు చెందిన ఓ మహిళ భర్త వేధింపులు తట్టుకోలేక స్థానిక పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసేందుకు 40 రోజుల కిందట వెళ్లింది. తన ఘోడు మెుత్తం ఎస్సై ఎదుట వెల్లబోసుకుంది. భర్త వేధింపుల గురించి పూస గుచ్చినట్లు ఆయనకు వివరించింది. భర్తపై ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరింది. అయితే ఫిర్యాదు నెపంతో మహిళ ఫోన్ నంబర్‌ను ఎస్సై తీసుకున్నాడు. ఆమెకు తరచూ ఫోన్లు చేస్తూ మాటలు కలిపే ప్రయత్నం చేశాడు. మెల్లిగా తన వక్రబుద్ధి మహిళ ఎదుట బయటపెట్టాడు ఆ ఎస్సై. కేసును తాను పరిష్కరిస్తానని, కాకపోతే కోరిక తీర్చాలంటూ పట్టుపట్టాడు.

Minister Thummala: నేను రాజకీయాల్లోకి రావడానికి కారణమదే.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు


ఇంటికి వస్తానని, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చెప్పాలంటూ మహిళను వేధించడం మెుదలుపెట్టాడు. తరచూ ఆమెకు వాట్సాప్ కాల్స్ చేస్తూ ఇబ్బందులకు గురి చేశాడు. ఆమె భర్తపై కేసు నమోదు చేయాలంటే కోరిక తీర్చాల్సిందే అంటూ పదేపదే ఆమెను హింసించాడు. ఘటనపై విసిగు చెందిన సదరు మహిళ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబును ఆశ్రయించింది. ఎస్సై వేధింపులపై ఫిర్యాదు చేసింది. గత 40 రోజులుగా కోరిక తీర్చాలంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ సీపీకి ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మహిళను ఎస్సై పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరింపులకు దిగాడు. విషయం బయటకు చెప్పొదంటూ ఆమెను భయాందోళనలకు గురి చేశాడు. అయితే ఎస్సైపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, తనను ఆ ఎస్సై నుంచి కాపాడాలని మహిళ వేడుకుంటోంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మేయర్ ఆదేశాలు సైతం డోంట్ కేర్ అంటున్న ఎమ్మెల్సీ..

KTR: ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్ళీ వచ్చాయి..

Updated Date - Nov 24 , 2024 | 05:04 PM