Home » ICC
అండర్ 19 వన్డే ప్రపంచకప్ 2024 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన అండర్ 19 వన్డే ప్రపంచకప్ 2024 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టులో భారత ఆటగాళ్ల అధిపత్యం కనిపించింది. ఈ జట్టులో ఏకంగా నలుగురు టీమిండియా కుర్రాళ్లకు అవకాశం దక్కింది.
T20 World Cup 2024: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్. తాజాగా టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు జరుగున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించి టికెట్లను జారీ చేసింది ఐసీసీ. పబ్లిక్ టిక్కెట్ బ్యాలెట్ విధానంలో విక్రయిస్తున్నారు.
Telangana: బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది.
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ నాసిర్ హొస్సేన్(Nasir Hossain)పై ఐసీసీ(ICC) వేటు వేసింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలతో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో రెండేళ్లపాటు నిషేధం విధించింది.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ ముగిసిన తర్వాత పిచ్‌లపై రోహిత్ చేసిన వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్‌గా ఉందని సమాచారం. దీంతో అతడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ICC Awards 2023: గత ఏడాదికి సంబంధించి ఐసీసీ అవార్డుల రేసులో టీమిండియా ఆటగాళ్లు దూసుకెళ్తున్నారు. తాజాగా ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఉన్నారు.
క్రికెట్లో ఎప్పటికప్పుడు ఐసీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూనే ఉంది. తాజాగా మరికొన్ని నిబంధనలను ఐసీసీ అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో ఫీల్డింగ్ జట్టు స్టంపౌంట్ కోసం అప్పీల్ చేసినప్పుడు స్టంపౌంట్‌తో పాటు క్యాచ్ అవుట్‌ను కూడా సమీక్షించేవారు. కానీ కొత్త నిబంధన ప్రకారం కేవలం స్టంపౌంట్‌ను మాత్రమే పరిశీలించనున్నారు.
Team India: టెస్టుల్లో ఐసీసీ ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న టీమిండియా తాజాగా చెత్త రికార్డును నమోదు చేసింది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన టీమిండియా 13 ఏళ్ల తర్వాత సఫారీ గడ్డపై చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ICC: మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందాన అసలే దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమితో సతమతం అవుతుందన్న టీమిండియాపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రోహిత్ సేనకు ఐసీసీ జరిమానా విధించింది. అంతేకాకుండా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో కీలకమైన రెండు పాయింట్లను కూడా ఐసీసీ కట్ చేసింది.
New Rule: క్రికెట్‌ను మరింత రంజుగా మార్చేందుకు ఐసీసీ కొత్త నిబంధన అమల్లోకి తెస్తోంది. క్రికెట్లో స్టాపింగ్ క్లాక్ పేరుతో ఈ రూల్ రానుంది. కొత్త నిబంధన ప్రకారం బౌలింగ్ జట్టు తమ తర్వాతి ఓవర్లోని తొలి బంతిని మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపే వేయాల్సి ఉంటుంది. లేకపోతే బౌలింగ్ జట్టుకు 5 పరుగులు పెనాల్టీగా విధిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది.