Team India: టీమిండియాకు ఘోర అవమానం.. ఐసీసీ కావాలనే చేసిందా
ABN , Publish Date - Jan 24 , 2025 | 05:10 PM
ICC: భారత క్రికెట్ జట్టుకు ఘోర అవమానం జరిగింది. ఇన్నేళ్లలో టీమిండియా విషయంలో ఇలా జరగడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ఐసీసీ కావాలనే చేసిందా? అసలు మ్యాటర్ ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

టీమిండియాకు ఘోర అవమానం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించే ర్యాంకులు, అవార్డులు, జట్లు.. ఇలా అన్నింటా టాప్‌లో ఉండే భారత్‌కు ఈసారి తీవ్ర అన్యాయం జరిగింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో మెన్ ఇన్ బ్లూ నుంచి ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్లతో నిండిన టీమ్ నుంచి కనీసం ఒక్క ప్లేయర్‌కూ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో బెర్త్ దక్కకపోవడం కొత్త చర్చకు దారితీసింది. 11 మందితో కూడిన ఈ టీమ్‌కు కెప్టెన్‌గా శ్రీలంక బ్యాటర్ చరిత్ అసలంక ఎంపికయ్యాడు.
రీజన్ ఏంటి?
టీ20ల్లో దూసుకెళ్తున్న భారత జట్టు ఇతర ఫార్మాట్లలో మునుపటి రేంజ్‌లో పెర్ఫార్మ్ చేయలేకపోతోంది. ముఖ్యంగా టెస్టుల్లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక వరుస పరాభవాలతో పరువు తీసుకుంటోంది. వన్డే పెర్ఫార్మెన్స్ చూసుకుంటే.. గతేడాది కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడింది రోహిత్ సేన. వరల్డ్ కప్-2023 తర్వాత 50 ఓవర్ల మ్యాచ్‌లు ఎక్కువగా ఆడలేదు. భారత్ నుంచి ఒక్క ప్లేయర్‌కూ వన్డే ఫైనల్ ఎలెవన్‌లో బెర్త్ దక్కకపోవడానికి ఇదే రీజన్ అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. గతేడాది ఆడినవి మూడు వన్డేలు.. ఆ మూడింటా లంక చేతుల్లో ఓటమిపాలైంది మెన్ ఇన్ బ్లూ.
ఆ జట్ల ఆటగాళ్లే ఎందుకు?
వన్డే ఫైనల్ ఎలెవన్‌లో ఉపఖండం నుంచి ఏకంగా 10 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కడం గమనార్హం. అందులో నలుగురు శ్రీలంక ప్లేయర్లు, ముగ్గురు పాకిస్థాన్ క్రికెటర్లు, ముగ్గురు ఆఫ్ఘానిస్థాన్ ఆటగాళ్లు, ఒక వెస్టిండీస్ ప్లేయర్ ఉన్నారు. ఇతర జట్ల కంటే లంక, పాక్, ఆఫ్ఘాన్ ఎక్కువగా వన్డే మ్యాచులు ఆడటంతో వాళ్లకు ఎక్కువగా ఐసీసీ టీమ్‌లో అవకాశం దక్కి ఉంటుందని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ ఇదే..
సయీమ్ అయూబ్ (పాకిస్థాన్), రెహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘానిస్థాన్), పథున్ నిస్సంక (శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక), చరిత్ అసలంక (శ్రీలంక), షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ (వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయి (ఆఫ్ఘానిస్థాన్), వనిందు హసరంగ (శ్రీలంక), షహీన్ షా అఫ్రిదీ (పాకిస్థాన్), హారిస్ రౌఫ్, ఘజాన్‌ఫర్ (ఆఫ్ఘానిస్థాన్).
ఇవీ చదవండి:
అన్నీ వాళ్లకు చెప్పి చేయాలా.. పంత్ సీరియస్
భారత్‌ను రెచ్చగొడుతున్న ఆర్చర్
పాత రోహిత్ జస్ట్ వచ్చి వెళ్లాడు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి