Home » INDIA Alliance
స్పీకర్ ఓం బిర్లా బుధవారం సభనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో ఎమర్జెన్సీ రోజులను గురించి ప్రస్తావించడంతో.. తొలిరోజే లోక్సభలో గందరగోళం నెలకొంది.
లోక్సభ స్పీకర్ ఎన్నిక పూర్తైంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగుతుందని భావించినప్పటికీ.. స్పీకర్గా ఓంబిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. తొలుత స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు.
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా(Om Birla) మరోసారి ఎన్నికయ్యారు. స్పీకర్గా ఎన్నికవ్వడం వరుసగా రెండోసారి. ఈ సందర్భంగా ఓం బిర్లాను ప్రధాని మోదీ(PM Modi), లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజులు స్పీకర్ చైర్ వద్దకు తీసుకొచ్చారు.
లోక్సభ స్పీకర్ ఎన్నిక రేపు జరగనుంది. అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమి తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. అలాంటి వేళ ఇండియా కూటమిలో చీలిక వచ్చిందా? అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే అలాగే ఉన్నాయనిపిస్తుంది.
లోక్సభ స్పీకర్గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికవుతారని అంతా భావించారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తమ స్పీకర్ అభ్యర్థిగా కె.సురేశ్ను బరిలో దింపింది. దీంతో లోక్సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది.
మోదీ 2.0 హయాంలో లోక్సభలో స్పీకర్గా(Lok Sabha Speaker Post) పనిచేసిన ఓం బిర్లా(Om Birla) మళ్లీ ఎన్డీయే లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇండియా కూటమికి చెందిన మహిళా ఎంపీలు ఇలా ఓ ఫొటోకు పోజిచ్చారు.
ఎన్డీయే సర్కార్ మూడో సారి అధికారం చేపట్టిన తరువాత సోమవారం తొలి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు.
దేశంలో సరిగ్గా 50 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ(Emergency in India) విధించి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ముక్కలు చేసిందని ప్రధాని మోదీ(PM Modi) ధ్వజమెత్తారు. 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయ్యాక మోదీ ప్రసంగించారు.
కేంద్రంలో మూడోసారి ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) రేపు(జూన్ 24) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజే దాదాపు 280 మంది లోక్ సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.