Home » India tour of west indies2023
భారత్, వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు పలు రికార్డులను అందుకునే అవకాశాలున్నాయి. మొత్తం ఏడుగురు భారత ఆటగాల్లు ఏడు రికార్డులకు చేరువలో ఉన్నారు.
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వరుసగా పాకిస్థాన్ ఆటగాళ్ల రికార్డులను బద్దలుకొడుతున్నాడు. ఇప్పటికే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టిన గిల్.. తాజాగా మరో పాక్ ప్లేయర్ ఇమామ్-ఉల్-హక్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. కాకపోతే మరో యువ ఆటగాడి నుంచి తిలక్ వర్మకు గట్టి పోటీ తప్పే అవకాశాలు కనిపించడంలేదు.
రెండు, మూడో వన్డేల్లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మూడో వన్డే మ్యాచ్ అనంతరం పోస్ట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో హార్దిక్ మాట్లాడుతూ.. భారత ఆటగాళ్ల కనీసం అవసరాలను తీర్చడంలో కూడా విండీస్ బోర్డు విఫలమైందని విమర్శలు గుప్పించాడు.
మూడో వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది.
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో(India vs West Indies 3rd ODI) పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు(Jaydev Unadkat) టీమిండియా(Teamindia) తుది జట్టులో చోటు దక్కింది. అయితే జయవదేవ్ ఉనద్కత్‌కు ఏకంగా 3,539 రోజుల తర్వాత మళ్లీ భారత వన్డే జట్టులో చోటు దక్కడం గమనార్హం.
వెస్టిండీస్ గడ్డపై టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ జోరు కొనసాగుతుంది. మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ కొట్టాడు. 5 ఫోర్లు, 2 సిక్సులతో 43 బంతుల్లోనే కిషన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
భారత్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన సెలెక్టర్లు కెప్టెన్సీ బాధ్యతలను రోవ్‌మన్ పావెల్‌కు అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా కైల్ మేయర్స్ వ్యవహరించనున్నాడు.
భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చనున్న మూడో వన్డే మ్యాచ్ మంగళవారం ట్రినిడాడ్‌లోని టరుబాలో గల బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్ వేదికైనా టరుబాకు చేరుకున్నారు. ఈ క్రమంలో మన ఆటగాళ్లకు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తన కుమారుడితో కలిసి స్వాగతం పలికాడు.
భారత ఆటగాళ్లను ఉద్దేశించి మాజీ కెప్టెన్ కపీల్ దేవ్ చేసిన వ్యాఖ్యలకు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లకు డబ్బు కారణంగా అహంకారం వచ్చిందని కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలను జడేజా కొట్టిపారేశాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన జడేజాను విలేకరులు కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు.