IND vs WI: పాకిస్థాన్ ఆటగాళ్లను వదలని శుభ్‌మన్ గిల్.. మరో పాక్ ఆటగాడి రికార్డు బ్రేక్!
ABN , First Publish Date - 2023-08-02T19:58:14+05:30 IST
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వరుసగా పాకిస్థాన్ ఆటగాళ్ల రికార్డులను బద్దలుకొడుతున్నాడు. ఇప్పటికే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టిన గిల్.. తాజాగా మరో పాక్ ప్లేయర్ ఇమామ్-ఉల్-హక్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వరుసగా పాకిస్థాన్ ఆటగాళ్ల రికార్డులను బద్దలుకొడుతున్నాడు. ఇప్పటికే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టిన గిల్.. తాజాగా మరో పాక్ ప్లేయర్ ఇమామ్-ఉల్-హక్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. వెస్టిండీస్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో గిల్ 85 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెరీర్‌లో ఆడిన మొదటి 27 వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు. దీంతో పాక్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇమామ్-ఉల్-హక్ తన మొదటి 27 వన్డే మ్యాచ్‌ల్లో 1381 పరుగులు చేశాడు. మూడో వన్డేలో చేసిన రన్స్ ద్వారా ఇమామ్-ఉల్-హక్‌ను గిల్ అధిగమించాడు. మొదటి 27 వన్డేల్లో గిల్ 1437 పరుగులు చేశాడు.
కాగా అంతకుముందు జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో 34 పరుగులు చేసిన గిల్ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును బ్రేక్ చేశాడు. వన్డే కెరీర్‌లో ఆడిన మొదటి 26 వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో బాబర్ అజామ్‌ను అధిగమించాడు. బాబర్ తన వన్డే కెరీర్‌లో మొదటి 26 మ్యాచ్‌ల్లో 1322 పరుగులు చేశాడు. కాగా 1352 పరుగులతో అజామ్ రికార్డును గిల్ బద్దలుకొట్టాడు. ఇక తన కెరీర్‌లో ఇప్పటివరకు 27 వన్డేలాడిన గిల్ 62 సగటుతో 1437 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, 4 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక 18 టెస్టుల్లో 32 సగటుతో 966 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలున్నాయి. 6 టీ20 మ్యాచ్‌ల్లో 40 సగటుతో 202 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది.