Share News

India vs New Zealand: మొదలైన ముంబై టెస్ట్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే

ABN , Publish Date - Nov 01 , 2024 | 09:38 AM

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్‌ ప్రారంభమైంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయింది. ఇక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని కివీస్ ఉవ్విళ్లూరుతుండగా.. చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా యోచిస్తోంది. ఈ మ్యాచ్‌కు తుది జట్లు ఇలా ఉన్నాయి.

India vs New Zealand: మొదలైన ముంబై టెస్ట్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే
India Vs New Zealand

ముంబై: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిదైన మూడవ టెస్ట్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన పర్యాటక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు టీమ్ మేనేజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్థానంలో హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకుంది.

తుది జట్లు ఇవే..

న్యూజిలాండ్ : టామ్ లాథమ్(కెప్టెన్), డెవోన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే.

భారత్ : యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.


బుమ్రాపై బీసీసీఐ కీలక ప్రకటన

మూడవ టెస్టుకు అందుబాటులో లేని స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. బుమ్రా అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలిపింది. అందుకే ముంబైలో జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్‌ ఎంపికకు అతడు అందుబాటులో లేడని పేర్కొంది.

Updated Date - Nov 01 , 2024 | 09:47 AM