Champions Trophy Final: తొలుత అదరగొట్టి.. తర్వాత తడబడుతున్న కివీస్ బ్యాటర్లు.. స్కోర్ అంచనా ఎంతంటే
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:59 PM
ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. కివీస్ ఎంత స్కోర్ చేయనుంది. 15 ఓవర్ల తర్వాత కివీస్ స్కోర్‌పై అంచనాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయి వేదికగా జరుగుతోంది. కివీస్ జట్టుకు ఓపెనర్లు యంగ్, రచిన్ రవీంద్ర శుభారంభాన్ని అందించారు. పది ఓవర్లకే న్యూజిలాండ్ 69 పరుగులు చేసింది. మొదటి మూడు ఓవర్లలో పది పరుగులు చేసిన న్యూజిలాండ్, నాలగో ఓవర్‌లో 16 పరుగులు, ఐదో ఓవర్‌లో 11 పరుగులు చేసింది. ఎనిమిదో ఓవర్‌లో యంగ్ అవుట్ కావడంతో భారత బౌలర్లు కొంత ఊపిరి పీల్చుకున్నారు. మొదటి పది ఓవర్ల వరకు రచిన్ రవీంద్ర భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. మొదటి పవర ప్లేలో పది ఓవర్లకు ఒక వికెట నష్టానికి 69 పరుగులు చేసిన న్యూజిలాండ్ 11వ ఓవర్ తొలి బంతికే రచిన్ రవీంద్ర పెవిలియన్ చేరాడు. 13వ ఓవర్‌లో కేన్ విలయమ్‌సన్‌ను కుల్దీప్ పెవిలయన్ పంపాడు. దీంతో 15 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 250 నుంచి 260 పరుగులు చేయవచ్చని స్పోర్ట్స్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. ఒకవేళ భారత బౌలర్లు సమర్థంగా బౌలింగ్ చేసి వెంటవెంటనే వికెట్లు తీస్తే మాత్రం కివీస్‌ను 200 పరుగులలోపు కట్టడిచేసే అవకాశం ఉంది.
అన్ని విజయాలే..
ఛాంఫియన్స్ ట్రోపీలో ఇప్పటివరకు ఆడిన అన్నింటిలో భారత్ గెలుస్తూ వచ్చింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో ఈజీగా గెలుస్తామనే నమ్మకాన్ని క్రికెట్ అభిమానులు వ్యక్తం చేస్తున్నప్పటకీ న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్ లైనఫ్ చూస్తే ఫైనల్స్‌లో గెలుపు అవత ఈజీ కాదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కేన్ విలియమ్‌సన్, రచిన్ రవీంద్ర సెంచరీలతో అదరగొట్టారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో ఇద్దరు సెంచరీలు చేశారు. ప్రస్తుత ఫైనల్ మ్యాచ్‌లో రవీంద్ర అవుట్ కావడం భారత్‌కు ప్లస్‌గా చెప్పుకోవచ్చు. విలియమ్‌సన్ పెవిలియన్‌కు చేరడంతో న్యూజిలాండ్‌ను 250 పరుగులలోపు కట్టడి చేసే అవకాశం లేకపోలేదు.
కుల్దీప్ అదుర్స్
భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. తాను వేసిన మొదటి ఓవర్ మొదటి బంతికే డేంజరస్ బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్రను అవుట్ చేసిన కుల్దీప్, తాను వేసిన రెండో ఓవర్ రెండో బంతికి మరో డేంజరస్ బ్యాట్స్‌మెన విలియమ్‌సన్ పెవిలియన్ చేరడంతో భారత అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో సెంచరీలు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్‌సన్ అవుట్ కావడంతో భారత్ కొంత ఊపిరిపీల్చకున్నట్లైంది. మరో రెండు వికెట్లు త్వరగా పడితే మాత్రం న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయొచ్చ.
ఇవి కూడా చదవండి
BRS:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..
TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
AICC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here