Home » IPL 2024
నేడు ఐపీఎల్ 2024(IPL 2024)లో 46వ కీలక మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. చెన్నై(Chennai)లోని MA చిదంబరం స్టేడియం(MA Chidambaram Stadium)లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు ఫేవరెట్, ఎవరు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (76) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించడం..
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలయ్యింది. ఆ జట్టు నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో...
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత కోసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన జేక్ ఫ్రేసర్ మెగ్‌గుర్క్ (84) విధ్వంసం సృష్టించడంతో పాటు..
సాధారణ సమయాల్లో కాస్త సహనంగా, ప్రశాంతంగా ఉండే టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మ్యాచ్ విషయంలో మాత్రం చాలా భావోద్వేగంగా స్పందిస్తుంటాడు. టీమిండియా తరఫున ఆడే రోజుల్లో కూడా గంభీర్ మైదానంలో చాలా ఎమోషనల్‌గా ఉండేవాడు.
ఐపీఎల్ 2024లో నేడు 43వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడుతుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ముంబైకి హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే DC, MI మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో పిచ్ ఎలా ఉంటుంది, ఏ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024 (IPL 2024) చరిత్రలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు అతిపెద్ద స్కోరు లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. కోల్‌కతా నైట్ రైడర్స్(kolkata knight riders)తో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 262 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్‌కతాపై సులువుగా గెలిచింది.
సిక్సర్లు.. ఫోర్లతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం మోతెక్కిపోయింది. పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కోతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ పెనువిధ్వంసం సృష్టించారు. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్ మొదలుకొని 7వ నంబర్ బ్యాట్స్‌మెన్ అందరూ సమష్టిగా రాణించడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 261 పరుగుల రికార్డు స్థాయి స్కోరు బాదింది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bengaluru), సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad) మధ్య మ్యాచ్ జరుగగా మంచి ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఈ జట్టు ఓటమి కారణంగా SRH ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ చాలా విచారంగా కనిపించారు.
క్రికెట్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ యువజన సంఘాలు ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) ఎదుట ఆందోళనకు దిగాయి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి.. కార్యకర్తలతో గురువారం స్టేడియం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.