Share News

Viral Video: SRH ఓటమి కావ్య మారన్ రియాక్షన్స్ వైరల్

ABN , Publish Date - Apr 26 , 2024 | 10:50 AM

ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bengaluru), సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad) మధ్య మ్యాచ్ జరుగగా మంచి ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఈ జట్టు ఓటమి కారణంగా SRH ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ చాలా విచారంగా కనిపించారు.

Viral Video: SRH ఓటమి కావ్య మారన్ రియాక్షన్స్ వైరల్
rcb Defeat SRH Kavya Maran Reaction pics viral social media

ఐపీఎల్ 2024(IPL 2024)లో నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(royal challengers bengaluru), సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad) మధ్య మ్యాచ్ జరుగగా మంచి ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. RCB 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌(SRH) జట్టును సొంత మైదానంలో ఓడించింది. దీంతో ఈ జట్టు ఓటమి కారణంగా SRH ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ చాలా విచారంగా కనిపించారు. అందుకు సంబంధించిన ఆమె స్పందన చిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) బౌలర్లు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల వికెట్లు తీస్తున్నప్పుడు ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ స్పందన కెమెరాలో రికార్డైంది. SRH జట్టు వికెట్ల పతనాన్ని చూసిన కావ్య మారన్ చాలా నిరాశగా కనిపించారు. ఆ సమయంలో కావ్య మారన్ పలు సందర్భాలలో చాలా కోపంగా కూడా కనిపించారు. కావ్య మారన్ చేసిన రియాక్షన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ గత ఫామ్‌ను చూస్తుంటే ఆర్‌సీబీ(RCB) ఓడిస్తుందని అనేక మంది ఊహించలేదనే చెప్పాలి. ఈ క్రమంలో కొన్ని మ్యాచ్‌ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిని ఎదుర్కొంది. ఈ జట్టు 8 మ్యాచుల్లో 5 గెలిచి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కలిగి ఉంది. అంతేకాదు ప్లేఆఫ్‌కు వెళ్లేందుకు కూడా గట్టి పోటీ జట్టుగా ఉంది. మరోవైపు ఈ విజయం సాధించినప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాత్రం ఇప్పటికీ అట్టడుగున 10వ స్థానంలోనే కొనసాగుతోంది.


ఇది కూడా చదవండి:

రైజర్స్‌ కు ముకుతాడు


CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం


Read Latest Sports News and Telugu News

Updated Date - Apr 26 , 2024 | 11:01 AM