MI vs DC: పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్.. ఢిల్లీ విజయం
ABN , Publish Date - Apr 27 , 2024 | 07:54 PM
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలయ్యింది. ఆ జట్టు నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో...
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పరాజయం పాలయ్యింది. ఆ జట్టు నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులకే పరిమితం అయ్యింది. మొదట్లో టాపార్డర్ విఫలమవ్వడం, వెనువెంటనే వికెట్లు పడటంతో.. భారీ తేడాతో ఢిల్లీ గెలుపొందుతుందని అంతా అనుకున్నారు. కానీ.. తిలక్ వర్మ, హార్దిక్, టిమ్ డేవిడ్ గెలుపుపై ఆశలు రేకెత్తించారు. వీళ్లు ముగ్గురు ధీటుగా ఆడి.. లక్ష్యానికి చేరువకి జట్టుని తీసుకొచ్చారు. కానీ.. చివర్లో వీరి ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది.
నాకు చోటు దక్కకపోతే ఆ పని చేస్తా.. శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. జేక్ ఫ్రేసర్ (88) ఊచకోత కోయడంతో పాటు స్టబ్స్ (48), హోప్ (41), ఫోరెల్ (36), రిషభ్ పంత్ (29) చితక్కొట్టడంతో.. ఢిల్లీ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. లక్ష్య ఛేధనలో భాగంగా.. ముంబై జట్టుకి ఆదిలోనే వరుస దెబ్బలు తగిలాయి. ఇషాన్ కిషన్ (20), రోహిత్ శర్మ (8), సూర్యకుమార్ (26) ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఢిల్లీ బౌలర్లకు తమ వికెట్లను త్వరగా సమర్పించుకున్నారు. అప్పుడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), తిలక్ వర్మ (Tilak Varma) కలిసి కాసేపు దుమ్మురేపారు. వెంటనే వికెట్ పడనివ్వకుండా.. మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా.. హార్దిక్ ఈరోజు కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుని గెలిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. ఆ దూకుడులోనే అతడు క్యాచ్ ఔట్ అయ్యాడు.
నాలుగేళ్ల తర్వాత ఇంటికొచ్చిన భర్త.. తమ్ముడితో భార్యను అలా చూసేసరికి..
ఇక ఈ మ్యాచ్ ముంబై చేజారిందని అనుకునేలోపే.. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ (Tim David) మళ్లీ ఆశలు రేకెత్తించారు. వీళ్లిద్దరు కలిసి ఎడాపెడా షాట్లతో చెలరేగి ఆడారు. ఎక్కడో ఉన్న స్కోరుని.. దాదాపు లక్ష్యానికి చేరువలో తీసుకొచ్చారు. ఈ ఇద్దరి ఆటగాళ్ల ఆటతీరు చూసి.. ముంబై గెలుస్తుందనే నమ్మకాలు ఏర్పడ్డాయి. కానీ.. అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేలోపే దురదృష్టం హగ్ ఇచ్చి వెళ్లిపోయింది. డేవిడ్ ఔట్ అయినా.. తిలక్ వర్మ చివరివరకూ లాక్కొచ్చాడు. కానీ.. చివరి ఓవర్‌లో తొలి బంతికి రనౌట్ కావడంతో ముంబై కథ కంచికి చేరింది. చివర్లో వచ్చిన టైలెండర్లూ తమవంతు ప్రయత్నాలు చేశారు కానీ, ఫలితం లేకుండా పోయింది. దీంతో.. ముంబై జట్టు 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఢిల్లీ బౌలర్లలో సలామ్, ముకేష్ తలా మూడు వికెట్లతో సత్తా చాటారు.
Read Latest Sports News and Telugu News