Home » IPS
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీలు షురూ అయ్యాయి. ఇప్పటికే డీజీపీని నియమించిన ప్రభుత్వం.. తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. ఎన్నికల ముందు వరకూ..
సిలాదిత్య చెటియా 2009 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం అసోం హోం సెక్రటరీగా పనిచేస్తున్నారు. భార్యకు క్యాన్సర్ రావడంతో గత నాలుగు నెలల నుంచి సెలవులో ఉన్నారు. గువహటిలో గల నెమ్ కేర్ ఆస్పత్రిలో భార్యకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారింది.
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్‌హెగ్డే(Rahul Hegde) నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బదిలీల్లో సిటీ ట్రాఫిక్ డీసీపీగా ఉన్న రాహుల్ హెగ్డే సూర్యాపేట ఎస్పీగా వెళ్లారు.
తెలంగాణ(Telangana)లో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ(IPS transfer) అయ్యారు. 28మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున బదిలీలు చేపట్టింది.
శుక్రవారం జరిగిన ఆలిండియా సర్వీసెస్ అధికారుల(IAS, IPS) సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు పని చేసిన విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు లోతైన వ్యాఖ్యలు చేశారు. అధికారులతో ఎప్పుడూ సన్నిహితంగా, దగ్గరగా ఉండే చంద్రబాబు వ్యాఖ్యలతో..
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు తనకు ప్రభుత్వం కేటాయించిన ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఈరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ..
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను తప్పుబడుతూ, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు హైకోర్టులో వాదనలు వినిపించారు.
సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ఆపడం లేదు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని, జీతభత్యాలు తక్షణమే చెల్లించాలని క్యాట్ ఇదివరకే స్పష్టం చేసింది. క్యాట్ ఆదేశాలను జగన్ సర్కార్ లెక్క చేయడం లేదు.
ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాడులు పెరిగిపోయాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) జరిగిన పోలింగ్ రోజు, మరుసటి రోజు నుంచి కూడా వైసీపీ మూకలు అల్లర్లకు పాల్పడుతున్నాయి. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతోంది.
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పాలనపై దృష్టి సారించిన ప్రభుత్వం.. త్వరలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయనుందా? ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టిందా? జూన్ 4న ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఏ క్షణాన్నైనా బదిలీ ఉత్తర్వులను విడుదల చేయనుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు, పరిపాలనలో ప్రభుత్వ అవసరాలు ఔననే చెబుతున్నాయి. ఈ క్రమంలో కీలక శాఖలకు బాధ్యత వహిస్తున్న ఒకరిద్దరు అధికారులకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది.