Home » Israel
ఒక వైపు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న జనం.. మరో వైపు విదేశాలను ఆశ్రయిస్తున్న క్షతగాత్రులు.. ఇదీ గాజాలో పరిస్థితి. ఇలాంటి టైంలో యుద్ధం ముగించాలని ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయెల్- హమాస్(Israeil-Hamas)పై ఒత్తిడి చేస్తున్నా.. యుద్ధ విరమణపై ఎవరూ తగ్గేలా కనిపించడం లేదు. తమ వద్ద ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయని.. ఎన్ని నెలలైనా ఇజ్రాయెల్ తో పోరాటడానికి సిద్ధమని హమాస్ ప్రకటించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది. పరస్పర దాడులతో రెండు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచదేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
ఇజ్రాయెల్ - గాజాల(Israeil - Gaza) మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. తాజాగా గాజాను చుట్టు ముట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించడం ఆందోళనలు కలిగిస్తోంది. దీనికి ప్రతిగా హమాస్(Hamas) టెర్రరిస్టులు ఇజ్రాయెల్ సైన్యం మృతదేహాల్ని సంచుల్లో పెట్టి జెరూసలెంకి పంపుతామని హెచ్చరించడం యుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది. పరస్పర హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు హమాస్ కమాండర్లు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. సరిహద్దులోని రఫా క్రాసింగ్ని గురువారం తిరిగి తెరిచినట్లు గాజా సరిహద్దు అధికారులు తెలిపారు. దాదాపు 7,500 మంది విదేశీ పాస్పోర్ట్ హోల్డర్లు దాదాపు రెండు వారాల పాటు గాజాను విడిచిపెడతారని వెల్లడించారు.
ఇజ్రాయెల్ - హమాస్(Israel - Hamas) మధ్య జరుగుతున్న భీకర పోరులో అక్కడ నివసిస్తున్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. జీవించడానికి అనువైన ప్రదేశం కాదని చాలా మంది విదేశీయులు(Foreigners) ప్రస్తుతం పక్క దేశాలకు క్యూ కడుతున్నారు.
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర చేస్తోంది. హమాస్ని నాశనం చేయాలన్న లక్ష్యంతో.. ఇప్పటికే ఆహార, ఇంధన, నీరు, విద్యుత్ సరఫరాలపై నిషేధం విధించి గాజాను...
హమాస్ని సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో గాజాలో ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న దాడుల్ని ఇరాన్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్ని ఆపేయాల్సిందిగా ఆ ముస్లిం దేశం ఇజ్రాయెల్ని డిమాండ్ చేస్తూ...
రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా-నాగసాకి(Hiroshima- Nagasaki)లపై వేసిన న్యూక్లియర్ బాంబ్(Nuclear Bomb) కంటే 24 రెట్లు ప్రభావవంతమైన అణు బాంబు తయారు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ వైమానిక దాడుల్లో హమాస్ సీనియర్ కమాండర్ ఇబ్రహీం బియారీ మరణించారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. రెండు వైపుల నుంచి భీకర దాడులు కొనసాగుతుండడంతో యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. వెనక్కి తగ్గడానికి రెండు దేశాలు ఏ మాత్రం ఆసక్తి కనబర్చడం లేదు. కదనరంగంలో ముందుకే వెళ్తున్నాయ తప్ప వెనుకడుగు వేయడం లేదు.