Share News

Israeil-Hamas:ఇజ్రాయెల్‌తో ఢీ అంటే ఢీ అంటున్న హమాస్.. ఎన్ని రోజులైనా యుద్ధం చేస్తామంటూ ప్రకటన

ABN , First Publish Date - 2023-11-04T18:35:21+05:30 IST

ఒక వైపు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న జనం.. మరో వైపు విదేశాలను ఆశ్రయిస్తున్న క్షతగాత్రులు.. ఇదీ గాజాలో పరిస్థితి. ఇలాంటి టైంలో యుద్ధం ముగించాలని ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయెల్- హమాస్(Israeil-Hamas)పై ఒత్తిడి చేస్తున్నా.. యుద్ధ విరమణపై ఎవరూ తగ్గేలా కనిపించడం లేదు. తమ వద్ద ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయని.. ఎన్ని నెలలైనా ఇజ్రాయెల్ తో పోరాటడానికి సిద్ధమని హమాస్ ప్రకటించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.

Israeil-Hamas:ఇజ్రాయెల్‌తో ఢీ అంటే ఢీ అంటున్న హమాస్.. ఎన్ని రోజులైనా యుద్ధం చేస్తామంటూ ప్రకటన

గాజా: ఒక వైపు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న జనం.. మరో వైపు విదేశాలను ఆశ్రయిస్తున్న క్షతగాత్రులు.. ఇదీ గాజాలో పరిస్థితి. ఇలాంటి టైంలో యుద్ధం ముగించాలని ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయెల్- హమాస్(Israeil-Hamas)పై ఒత్తిడి చేస్తున్నా.. యుద్ధ విరమణపై ఎవరూ తగ్గేలా కనిపించడం లేదు. తమ వద్ద ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయని.. ఎన్ని నెలలైనా ఇజ్రాయెల్ తో పోరాటడానికి సిద్ధమని హమాస్ ప్రకటించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. హమాస్ తాజా ప్రకటనతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. హమాస్ తమ వద్ద ఉన్న బందీలను విడిచిపెట్టే వరకు గాజాపై దాడులు ఆపబోయేది లేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ తో సుదీర్ఘ కాలం యుద్ధం చేసేందుకు హమాస్ వద్ద ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. 'కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చే ఇజ్రాయెల్ సేనపై మేం ఒత్తిడి తేగలం. మా దగ్గర నెలల సరిపడా యుద్ధం చేసే వెపన్స్(Weapons), క్షిపణులు, ఆహార నిల్వలు, మెడిసన్స్ ఉన్నాయి. గాజా సిటీలో ఉన్న భూగర్భ టన్నెల్స్ లో మేం కొన్ని నెలల పాటు బతికి ఉండగలం. ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాం. 230 కి.మీ. దూసుకుపోయే రాకెట్లు మా వద్ద ఉన్నాయి. మమ్మల్ని అంత తేలికగా నాశనం చేయలేరు' అని హమాస్ ఉగ్రవాదులు చెబుతున్నారు.


గాజాలో అమాయక ప్రజల మరణాలు పెరుగుతున్నందునా.. ఇజ్రాయెల్ పై అంతర్జాతీయ సమాజం నుంచి మరింత ఒత్తిడి పెరుగుతుందని హమాస్(Hamas) భావిస్తోంది. పాలస్తీనా ఖైదీలను విడిచిపెడ్తేనే తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను వదిలేస్తామని హమాస్ అంటోంది. హమాస్ కు 40 వేల మందికి పైగా ఫైటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు గాజాలో భూమికి 80 మీటర్ల లోతులో వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సొరంగాల్లో నక్కినట్లు తెలుస్తోంది. ఈ టన్నెల్స్ నెట్ వర్క్ ని కనుక్కునేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది. హమాస్ భావిస్తున్నట్లుగా ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు వచ్చేటట్లు కనిపించట్లేదు. హమాస్ ని తుదముట్టించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. హమాస్‌ను నాశనం చేసే లక్ష్యం అంత తేలిక కాదని జోర్డాన్(Jordan) మాజీ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాన మంత్రి మార్వాన్ అల్-ముషర్ అన్నారు. గాజా(Gaza)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై ఆ దేశం చేసిన దాడిలో చాలా మంది పౌరులు మరణించారు. ఇప్పటివరకు యుద్ధంలో 10 వేలకు పైగా చనిపోయారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. వందల సంఖ్యలో ప్రజలు గాజా సరిహద్దు దాటుతూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరంతా ఈజిప్టులోకి ప్రవేశిస్తున్నారు.

Updated Date - 2023-11-04T18:36:09+05:30 IST