Home » ISRO
అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న భారతీయులు చంద్రయాన్-3 విజయవంతం కావాలని బలంగా కోరుకుంటున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రకటించినట్లుగా ఈ నెల 23న జాబిల్లిపైన భారత దేశం ముద్ర పడాలని ఆకాంక్షిస్తున్నారు.
జాబిల్లిపై చంద్రయాన్-3 (Chandrayaan-3) సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఒక్కరోజు ముందు ఇస్రో శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్‌కు (Chandrayaan-3) ఏదైనా ప్రతికూల పరిస్థితి కనిపిస్తే సాఫ్ట్ ల్యాండింగ్‌ను ఆగస్టు 27కు వాయిదా వేస్తామని అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (Space applications centre ISRO) ప్రకటించింది.
ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఇస్రో(ISRO) ప్రయోగించిన చంద్రయాన్-2(Chandrayaan-2)లోని ఆర్బిటర్.. తాజాగా చంద్రయాన్-3తో టచ్‌లోకి వచ్చింది.
చంద్రయాన్ 3 ఎప్పుడెప్పుడు చంద్రుడిపై అడుగుపెడుతుందా అని ఎదురుచూస్తున్న దేశ ప్రజలకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఓ శుభవార్త చెప్పింది.
జాబిలిపై చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 Mission) సాఫ్ట్ ల్యాండింగ్ ఘట్టం కోసం యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ కీలక ఘట్టానికి ఆగస్టు 23 (బుధవారం) సాయంత్రం 6.05 గంటలకు ఇస్రో ముహూర్తం కూడా నిర్ణయించింది. ఈ అద్భుత క్షణాలకు రెండు రోజుల ముందు చంద్రయాన్-3 ఆసక్తిగొలిపే కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
యావత్ భారతదేశంతోపాటు ప్రపంచదేశాలు ఆసక్తికరంగా గమనిస్తున్న చంద్రయాన్-3 మిషన్ (Chandrayaan-3 mission) అత్యంత కీలకమైన ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. మిషన్‌లో రెండవది, చివరిదైన డీ-బూస్టింగ్ ప్రక్రియను ఆదివారం వేకువజామున విజయవంతంగా పూర్తిచేసుకుందని ఇస్రో ప్రకటించింది. మిషన్ అత్యంత కీలకమైన దశలో ఉండడంతో అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తల వర్గాలు వెల్లడించాయి.
జాబిల్లి దిశగా తన ప్రయాణంలో చంద్రయాన్-3 (Chandrayaan-3)మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రొపల్షన్ మాడ్యూల్(Propulsion module) నుంచి విడిపోయిన ల్యాండర్ మాడ్యూల్(Lander module)ను చంద్రుడికి మరింత చేరువ చేయడంలో భాగంగా శుక్రవారం సాయంత్రం చేపట్టిన వేగం తగ్గింపు ప్రక్రియ విజయవంతమైందని ఇస్రో(ISRO) ప్రకటించింది.
చల్లని వెన్నెలను కురిపించే చంద్రుని గురించి లోతుగా తెలుసుకోవాలన్న బలమైన ఆకాంక్ష ప్రపంచమంతటికీ ఉంది. ఈ కలలను సాకారం చేయాలన్న లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) నిర్వహిస్తున్న చంద్రయాన్-3లో మరో కీలక ఘట్టం విజయవంతం అయింది.
కాంగ్రెస్ విధేయుడు, టీవీ చర్చల్లో విశ్లేషకుడిగా పాల్గొనే తెహసీన్ పూనావాలా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇస్రో శాస్త్రవేత్తలకు మూడు నెలల నుంచి ప్రభుత్వం జీతాలివ్వడం లేదన్నారు. ఈ ఆరోపణలపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సమాచారాన్ని సేకరించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్-3’ ప్రయోగంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రుడికి ఇది మరింత చేరువ అయ్యిందని..